కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు వారాలుగా ఎఫ్-35బి స్టెల్త్ (F-35B Fighter Jet) యుద్ధవిమానం టార్మాక్‌పై నిలిచే ఉంది. బ్రిటన్ రాయల్ నేవీకి (To the British Royal Navy) చెందిన ఈ అధునాతన జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎగరలేని పరిస్థితిలో ఉండటంతో విమానాన్ని టోయింగ్ వాహనంతో లాక్కెళ్లి, తాజాగా హ్యాంగర్‌లో ఉంచారు.ఇప్పటికే అక్కడే బ్రిటన్ టెక్నీషియన్‌లు ఉన్నా, సమస్య అంతకు మించి ఉండటంతో తాజాగా ఎయిర్‌బస్ A400ఎం అట్లాస్ విమానంలో మరో ఇంజనీర్ బృందం ఇండియాకి వచ్చింది. వీరు రెండు ఎంపికలపై పరిశీలన చేస్తున్నారు—విమానాన్ని అక్కడే బాగుచేయాలా లేక విడిభాగాలుగా విడదీయాలా అన్నదే ప్రశ్న.

స్టెల్త్ టెక్నాలజీ రహస్యం బయటకు పొక్కకూడదన్న ఆందోళన
ఈ జెట్ విలువ సుమారుగా 110 మిలియన్ డాలర్ల పైనే. ఇందులో శత్రు రాడార్లకు కనిపించని స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది బయటకు, తీవ్ర దౌత్య ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఒకొక్క స్క్రూకు వరకు భద్రతా కోడ్‌తో గుర్తించనున్నారు.విమానాన్ని విడదీయాల్సిన పరిస్థితి వస్తే, బ్రిటిష్ సైన్యం అతి ఖచ్చితమైన భద్రతా చర్యలు చేపడుతుంది. ప్రతి భాగం ప్రత్యేక రిజిస్ట్రేషన్‌తో రక్షణ పొందుతుంది. టెక్నాలజీ చోరీ కాకుండా ప్రత్యేక భద్రతా దళాలను కూడ మోహరించే అవకాశముంది.
ఇదే తొలిసారి కాదు… 2019లోనూ తరలింపు
ఇలాంటివి గతంలోనూ జరిగినవే. 2019లో అమెరికాలో కూడా ఒక ఎఫ్-35 స్టెల్త్ జెట్‌ను సి-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా తరలించారు. ఈసారి భారత్‌లో జరుగుతుండటంతో ప్రత్యేక భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండనున్నాయి.మొత్తానికి, ప్రపంచంలోని అత్యంత ఆధునిక యుద్ధవిమానాల్లో ఒకటైన ఎఫ్-35బి ఇప్పుడు భారత భూభాగంలో నిలిచిపోవడం ప్రపంచ రక్షణ రంగంలో దృష్టి ఆకర్షిస్తోంది.
Read Also : space capsule crash : అస్థికలు అంతరిక్షంలో ఉంచాలన్న ప్రయత్నం విఫలం…