హైదరాబాద్ : ఈ ఖరీఫ్ లో సీజన్ కోసం 11.50 లక్షల టన్నులు యూరియా (Urea) అడిగితే 9.80 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఇందులో జులై నెలవరకు కేటాయించింది 6.60 లక్షల టన్నులు అయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సరఫరా చేసింది కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమేనని విమర్శించారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో జులై వరకు లోటు 2.24 లక్షల టన్నులుగా ఉందన్నారు. 2024-25 యాసంగికి సంబంధించిన మిగులు యూరియా 1.92 లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నందు వల్లే, కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ లో కేటాయింపుల ప్రకారం ఇవ్వకపోయిన కూడా అధికారులు ఇప్పటివరకు సర్దుబాటు చేయగలిగారని చెప్పారు. సాధారణంగా ఆగస్టులో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది కాబట్టి కేంద్రం ఆగస్టులో ఇస్తామన్న ఎరువులతో పాటు, ఇప్పటివరకు సరఫరా లోటు 2.24 లక్షల టన్నులు కూడా సరఫరా చేయాలని విజప్తి చేశారు. కాగా ఇంతకు ముందు మీరు 12 లక్షల టన్నులు సరఫరా అయిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తెలుపగా, ఆయనే ఇప్పుడేమో 9.80 లక్షల టన్నులు (Tones) అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన యూరియాను సకాలంలో తెప్పిం చడానికి మీ వంతు బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Temple : జోగులాంబ టెంపుల్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాలి-మంత్రి కొండా సురేఖ