సికింద్రాబాద్‌లోని ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసీ పేరుతో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ఫెర్టిలిటీ సెంటర్ల (Fertility Centers) కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకురావడమే కాకుండా, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టాలని ప్రభుత్వ ఉద్దేశం.తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అధికారుల సమాచారం ప్రకారం
ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేసి, లైసెన్సుల ప్రామాణికత, రికార్డుల నిర్వహణ, వైద్య విధానాల అనుసరణ, సరోగసీ చట్టాల అమలు వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలించనున్నాయి. ఈ తనిఖీల ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికారుల సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 381 ఐవీఎఫ్ (IVF) సెంటర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 157 సెంటర్లు హైదరాబాద్ పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన సెంటర్లు ఇతర జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. మొదటి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని సెంటర్లలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా మిగిలిన సెంటర్లను పరిశీలించనున్నారు.

సమాధానం చెప్పడానికి
ఈ తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన ప్రత్యేక చెక్‌లిస్ట్‌ను రూపొందించారు. ఫర్టిలిటీ సెంటర్ల లైసెన్సులు, రికార్డులు, వైద్య విధానాలు, సరోగసీ నిబంధనల అమలు వంటి అంశాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి.తనిఖీల అనంతరం మూడు రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషనర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.’సృష్టి’ ఫర్టిలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నమ్రతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసులు నమ్రతను సుమారు 3-4 గంటల పాటు డీసీపీ పర్యవేక్షణలో విచారించారు. మొదట సమాధానం చెప్పడానికి మొండికేసిన ఆమె, ఆ తర్వాత తనకేం తెలియదు, అంతా సక్రమంగానే ఉంది అంటూ పొడిపొడిగా సమాధానాలు ఇచ్చారు.
నిబంధనల ప్రకారమే
హైదరాబాద్‌లోని రోగులకు సంబంధించిన రికార్డులు మాయం చేయడంపై పోలీసులు ప్రశ్నించగా, ఆచితూచి స్పందించినట్లు తెలిసింది. తన పేరు మీద క్లినిక్ నిర్వహించడం లేదని, వైద్యవృత్తిలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని నమ్రత వాదించారు.మొదటి రోజు విచారణ అనంతరం నమ్రతకు వైద్య పరీక్షలు నిర్వహించి, మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెను నేడు మరోసారి విచారించనున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో, ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఇతర సెంటర్లపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
IVF అంటే ఏమిటి?
IVF అంటే “ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్”. ఇది వంధ్యత్వ సమస్యలున్న దంపతులకు సంతానం కలిగేలా సహాయపడే అధునాతన వైద్య పద్ధతి.
IVF విజయవంతం అయ్యే శాతం ఎంత?
స్త్రీ వయసు, ఆరోగ్య పరిస్థితులు, వైద్య పద్ధతుల నాణ్యతపై ఆధారపడి సుమారు 40% నుండి 60% వరకు విజయావకాశాలు ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: