Female ASI attempted suicid

పోలీస్ స్టేషన్లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం..

మహిళలకు ఎక్కడ రక్షణ అనేది దక్కడం లేదు. మహిళలను కాపాడే పోలీసులే కీచకులుగా మారుతున్నారు. తోటి మహిళా పోలీస్ అధికారిపై కూడా వేదింపులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా ఏఎస్సైనే ఓ SI వేధించడం తో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిలిప్ చేడ్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

Advertisements

పోలీస్ స్టేషన్ లో ఎస్సై యాదగిరి తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఏఎస్సై పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె సోదరుడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. తమ స్టేషన్ ఎస్సై యాదగిరి తనకు రెండురోజులు కంటిన్యూగా డ్యూటీ వేసి.. ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఆబ్సెంట్ వేస్తున్నాడని, ఆయనకు లొంగకపోతే ఇలా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు లేఖలో పేర్కొంది. అందరినీ ఒకలా, తనను మరోలా చూస్తున్నాడని.. ప్రతి చిన్నదానికి ఆబ్సెంట్ వేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు ఎలాంటి అఘాయిత్యం జరిగినా.. అందుకు కారణం ఎస్సై యాదగిరినే అని, మహిళా పోలీసులను లొంగదీసుకోవాలని వేధించే అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని, కఠినంగా శిక్షించాలని కోరింది.

Related Posts
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు

నాలుగు కేసుల్లో విచారణకు హాజరైన రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తనపై నమోదైన నాలుగు కేసుల విచారణలో భాగంగా గురువారం నాంపల్లిలోని ఎక్సైజ్ కేసుల Read more

KTR : పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు పై కేటీఆర్ ఆగ్రహం
KTR పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు పై కేటీఆర్ ఆగ్రహం

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం సామాన్యులపై భారం వేసింది పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని Read more

గేమ్ ఛేంజర్ కి షాక్ స్పెషల్ షోస్ రద్దు
గేమ్ ఛేంజర్ కి షాక్ స్పెషల్ షోస్ రద్దు

తెలంగాణ లో గేమ్ చంగెర్ మూవీ స్పెషల్ షో లను రద్దు చేస్తూ హోమ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు Read more

అందుబాటులోకి సాగర్ బోట్ హౌస్‌
అందుబాటులోకి సాగర్ బోట్ హౌస్‌

తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టూరిజం శాఖపై సమీక్ష Read more

×