బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.

బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.

బుల్లి రాజుగా తెరంగేట్రం చేసిన బాల నటుడు రేవంత్ భీమాల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే, రేవంత్ భీమాల కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రేవంత్ భీమాల. ఈ క్రమంలో రేవంత్ భీమాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌లు సృష్టించి తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తమ కుమారుడి పేరు మీద ఫేక్ అకౌంట్లు సృష్టించి ఒక సినిమా ప్రచారం కోసం చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని శ్రీనివాసరావు అన్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు.రేవంత్ కు ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ కుమారుడు రేవంత్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, బుల్లి రాజుగా రేవంత్‌ను ఆదరించి, ఆశీస్సులు అందజేసిన తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

telugu samayam

ఈ చిత్రంలో బుల్లి రాజుగా రేవంత్ పాత్రను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు. చిన్న వయస్సులోనే తన నటనతో ఆకట్టుకుని, తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఈ సపోర్ట్ ఆయన భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీనివాసరావు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల పట్ల జాగ్రత్త:
అభిమానులు, ప్రజలు ఆన్‌లైన్ లో రేవంత్ భీమాల పేరుతో కనిపించే అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కోరారు.రేవంత్ భీమాల ఫేక్ అకౌంట్ల వ్యవహారాన్ని పోలీసులకు తెలియజేశామని, దర్యాప్తు జరుగుతోందని, తప్పుదారిన పయనించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఫేక్ అకౌంట్లు, తప్పుడు ప్రచారాలు కల్పించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.రేవంత్ భీమాల భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి, పెద్ద హీరోగా ఎదగాలని తాము ఆకాంక్షిస్తున్నామని, అందరి దీవెనలూ అలాగే కొనసాగాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు.తమ కుమారుడు రేవంత్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆశించిన విజయాన్ని సాధించడం తమ కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సినిమాతో రేవంత్‌కు వచ్చిన పేరు, గుర్తింపు చూసి గర్వంగా ఉందని, ఈ విజయం సాధించడంలో రేవంత్‌ను ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts
రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?
Revanth govt key decision on rythu bharosa?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక Read more

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార
Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా Read more

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాజకీయాల్లో వేడి – సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ భేటీ ముఖ్యాంశాలు

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Read more

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోడీ
Prime Minister Modi to visit Amravati on 15th of next month

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ వచ్చే నెల 15వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల Read more