వోల్వో 2025 XC60 (Volvo XC60) ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఆగస్టు 1, 2025న (On August 1, 2025) ఈ మోడల్ అధికారికంగా మార్కెట్‌లోకి వస్తుంది. ఇప్పటికే ఫిబ్రవరిలోనే ఇది ప్రివ్యూలో చూపించారు. కానీ విడుదల వాయిదా పడింది.ఈ కొత్త మోడల్‌లో డిజైన్ కాస్త శక్తివంతంగా మారింది. నూతన గ్రిల్, మెరుగైన ఎయిర్ వెంట్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సరికొత్త అల్లాయ్ వీల్స్ ఈ కారుకు స్టైలిష్ లుక్ ఇచ్చాయి. మొత్తం రూపాన్ని మార్చకుండా, మోడర్న్ టచ్ ఇచ్చారు.

అదిరే ఇంటీరియర్ ఫీచర్లు
లోపల భాగంలో 11.6 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి పనిచేస్తుంది. గూగుల్ బిల్ట్-ఇన్ సేవలతో ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి.వెంటిలేటెడ్ నప్పా లెదర్ సీట్లు, క్రిస్టల్ గేర్ షిఫ్ట్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ కారును విలాసవంతంగా మార్చాయి. బోవర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టమ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఇంజిన్ ఎంపికలు రెండు రకాలుగా
ఈ మోడల్ రెండు పవర్‌ట్రెయిన్ వేరియంట్లతో వస్తుందని అంచనా.B5 మైల్డ్ హైబ్రిడ్: 2.0 లీటర్ టర్బో ఇంజిన్, 247 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఇది 48 వోల్ట్ బ్యాటరీతో ఆల్ వీల్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది.T8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్: 455 హెచ్‌పీ పవర్‌తో, కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ వేగం అందుతుంది. ఇది 35 మైళ్ల వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తుంది.
భద్రతలో మరో మెట్టు ఎక్కిన వాహనం
వోల్వో భద్రతపై ఎప్పుడూ నమ్మకంగా ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్, లేన్ అసిస్ట్, రియర్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పైలట్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చాయి.కొత్త ఫారెస్ట్ లేక్, అరోరా సిల్వర్, మల్బరీ రెడ్ రంగులు అందుబాటులో ఉంటాయి. 483 లీటర్ల బూట్ స్పేస్‌తో దీన్ని ట్రావెల్‌కు ఉపయోగించవచ్చు.
Read Also :Nipah Virus : ఆందోళన కలిగిస్తున్న నిఫా వైరస్.. కేరళలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్