Extension of Nampally Numaish till 17th

నాంప‌ల్లి నుమాయిష్ 17వ తేదీ వ‌ర‌కు పొడిగింపు

రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతి

హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేసే నాంపల్లి నుమాయిష్ మరో రెండు రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి 15న ఎగ్జిబిషన్ పూర్తవనుండగా.. ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్ ఉండనుందని నిర్వాహకులు ప్రకటించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం లో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించిందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కే నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సభ్యులు సుఖేష్ రెడ్డి, ధీరజ్ జైస్వాల్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ ను ఆయన కార్యాలయంలో కలిసి ఎగ్జిబిషన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

image

ఈ సందర్భంగా సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఈ సంవత్సరం మూడవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, దీంతో స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని విన్నవించారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

కాగా, 1938లో నిజాం కాలంలో మొదలైన నాంపల్లి నుమాయిష్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి సందర్శకులు, స్టాల్స్ నిర్వాహకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దేశంలోని అన్ని రకాల బ్రాండ్ ఉత్పత్తులతో పాటు, హస్తకళల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఫుడ్ కోర్టులు, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేందుకు గేమ్ జోన్స్ కూడా ఉంటాయి.

Related Posts
MMTC Train: ఎంఎంటీసీ ట్రైన్ అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతీ
MMTC train: ఎంఎంటీసీ ట్రైన్ అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతీ

లోకల్ ట్రైన్‌లో యువతిపై దాడి, తప్పించుకునేందుకు రైలు నుంచి దూకిన బాధితురాలు సికింద్రాబాద్‌లో ఓ యువతిపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆమెపై యువకుడు అత్యాచారయత్నానికి Read more

టాటా మోటార్స్ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాల 10వ వార్షిక నివేదిక విడుదల
Release of 10th Annual Report of Tata Motors CSR activities

ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, తమ వ్యూహాత్మక కమ్యూనిటీ జోక్యాల యొక్క పరివర్తన ప్రభావాన్ని వేడుక చేసుకుంటూ ఈరోజు తమ 10వ Read more

KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌ బారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏళ్ల విజయ యాత్రను పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం Read more

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్
50 percent increase Ticket rates in Telangana RTC buses!

హైదరాబాద్‌: సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ Read more