భారతదేశం ఇటీవల ఎగుమతుల రంగంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. ప్రత్యేకంగా తయారీ రంగంలో వచ్చిన వేగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ (Production Linked Incentive (PLI) Scheme).ఈ స్కీమ్ వల్ల దేశీయంగా తయారీ పెరిగింది. దీని ప్రభావంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. ట్రెడిషనల్ ఉత్పత్తులైన పెట్రోలియం, వజ్రాలను కూడా ఎగుమతుల్లో ఇది అధిగమించింది.ఇటీవల విడుదలైన డేటా ప్రకారం, 2022-23లో భారత్ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10.96 బిలియన్లు. 2023-24లో ఇవి 15.57 బిలియన్ల డాలర్ల (These are $15.57 billion in 2023-24) కు చేరాయి.

2024-25లో ఇది మరింత పెరిగి 24.14 బిలియన్ల డాలర్లు అయింది.అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, ఇటలీ, చెక్ రిపబ్లిక్ దేశాలకు భారతదేశం నుంచి అధికంగా ఎగుమతులు జరిగాయి.అమెరికాలో (Smart Phones) ఎగుమతులు ఐదింతలు పెరిగాయి.2022-23లో 2.16 బిలియన్లు ఉండగా, 2024-25లో 10.6 బిలియన్ల డాలర్లు అయ్యాయి.జపాన్‌కూ ఇదే రీతిలో పెరుగుదల కనిపించింది. 2022-23లో 120 మిలియన్ డాలర్లు, ఇప్పుడు 520 మిలియన్ డాలర్లు అయ్యాయి.ఈ రికార్డు వృద్ధి వల్ల స్మార్ట్‌ఫోన్లు భారత ఎగుమతుల్లో టాప్ స్థానంలో నిలిచాయి.
పెట్రో ఉత్పత్తులు, వజ్రాల కన్నా ఇవి ఎక్కువ ఆదాయం ఇచ్చాయి.వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.వారు మాట్లాడుతూ, ఇది భారత తయారీ రంగానికి గర్వకారణం అని చెప్పారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, PLI స్కీమ్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషించాయి.2024లో ఇండియాలో తయారైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 94% వాటా వీరిదే. మొత్తం ఎగుమతుల్లో ఏడాదికోసారి 6% వృద్ధి నమోదైంది.2025 నాటికి భారతదేశం స్మార్ట్‌ఫోన్ తయారీలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందనేది నిపుణుల అంచనా.ఈ వేగవంతమైన అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి బలమైన సంకేతం. సాంకేతికత, వినియోగదారుల విశ్వాసం, ప్రభుత్వ మద్దతు కలిసి ఈ విజయాన్ని సాధించాయి.
Read Also : Manchu Manoj : ‘మరో జన్మంటూ ఉంటే నువ్వే భర్తగా రావాలి’:మంచు మనోజ్ భార్య ఎమోషనల్