విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు (Vizianagaram Terror Case)లో కేంద్ర దర్యాప్తు సంస్థ NIA మూడో రోజు విచారణను పూర్తి చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులైన సిరాజ్, సమీర్ (Siraj, Sameer)ల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పాల్పడే కుట్ర భాగంగా వీరి ప్లాన్ ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో కీలకమైన పలు సమాచారం వెలుగులోకి వచ్చింది.
మల్టి సిటీ రెక్కీ: హైదరాబాదు నుంచి ముంబై వరకు కదలికలు
NIA దర్యాప్తులో భాగంగా నిందితులు దేశంలోని పలు నగరాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. హైదరాబాదు, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో వీరి కదలికలు గుర్తించారు. పేలుళ్లకు అవసరమైన ప్రదేశాలను గుర్తించేందుకు వారు ముందస్తుగా పర్యటనలు నిర్వహించినట్టు సమాచారం. నిందితుల ప్రయాణ వివరాలు, బస చేసిన ప్రాంతాలపై NIA అధికారులు క్లుప్తంగా విచారించారు.
విదేశీ నిధులు – ఉగ్రవాద లింకులు పరిశీలనలో
సౌదీ అరేబియా నుంచి నిందితులకు వచ్చిన నిధులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. వీరి ఫోన్ కాల్స్, సోషల్ మీడియా అకౌంట్లు, చాటింగ్ హిస్టరీలను విశ్లేషిస్తూ విదేశీ కుట్రలతో ఉన్న అనుసంధానాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణలో ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని NIA వర్గాలు తెలిపాయి.
Read Also : Miss World 2025 : మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ