కర్ణాటక రాజధాని బెంగళూరు (Bangalore)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంలోని కలాసిపాళ్యం బస్టాండ్ వద్ద ఒక అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్ (A suspicious plastic bag at the bus stop) కనిపించడంతో భారీ కలకలం రేగింది. బస్టాండ్ టాయిలెట్ సమీపంలో ఉన్న ఆ బ్యాగ్‌ను పరిశీలించగా, అందులో ఆరు జిలెటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, దుకాణదారులను త్వరగా బయటకు పంపించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు.
ఇతర చోట్ల ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బెంగళూరు పోలీసు అధికారి గిరీశ్ మాట్లాడుతూ, “ఒక బ్యాగ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించాం. అయితే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కాలేదు” అని తెలిపారు. బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లభించలేదని స్పష్టం చేశారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ జిలెటిన్ స్టిక్స్‌ను బెంగళూరు నుంచి తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి ప్రాంతాల్లోని రాళ్ల గుట్టలను పగలగొట్టేందుకు తరలిస్తుండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే, ఉగ్రవాద కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రజల్లో భయాందోళన
బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు దొరకడంతో స్థానికుల మధ్య భయం పెరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సద్విధంగా స్పందిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం అధికారులు మరింత విచారణ జరుపుతున్నారు.ప్రజలెవ్వరూ గందరగోళానికి లోనవద్దని, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగా, సిటీ మొత్తంలో సెక్యూరిటీ పెంచారు.
Read Also : Rahul Gandhi : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు