కేంద్ర జలశక్తి మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
హైదరాబాద: తెలంగాణ(Telangana)లో పెండింగ్లో (Pending) ఉన్న ప్రాజెక్టులకు త్వరగా అనుమతి
ఇవ్వాలని కృష్ణానదిలో జిడబ్ల్యుడిటి అవార్డుకు అనుగుణంగా 45 టిఎంసిల నీరు వాడుకోవడానికి పర్యావర్ణశాఖ సిసి. ఇసి జారీచేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రజలశక్తి మంత్రి సిఆర్పాటిల్కు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి(Uttam Kumar Reddy) లేఖ రాశారు. పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు. ఈ ప్రాజెక్టులకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్ లాంటి ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు పొందే వీలుంటుంది. 2021 సెప్టెంబర్ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ డిపిఆర్ సమర్పించింది. ఛత్తీస్ గఢ్ నుంచి నోఆబ్జెక్షన్ లేనందున ఇంటర్ట్ మ్యాటర్స్ డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. ఛత్తీస్ గఢ్ సూచనలను, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆక్రమంగా నీటి మళ్ళింపును అడ్డుకోవాలని ఉత్తమ్ డిమాండ్
ముంపు విషయంలో ఖరగ్పూర్ ఐఐటీ ఇచ్చిన నివేదిక లోని సిఫారసులను పాటించేందుకు సిద్ధంగా ఉంది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు అవశేష ఆంధ్రప్రదేశ్ ఆక్రమంగా నీటి మళ్ళింపును అడ్డుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి +880 అడుగుల వద్ద 1.5 లక్షల క్యూసెక్స్ కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లిస్తోంది. ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టిఎంసి ల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్ కాల్వల నిర్మాణాలు చేపట్టింది. 797 అడుగుల వద్ద రోజుకు 3 టిఎంసిలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించింది. కృష్ణా నది నుంచి వరద నీటిని బేసిన్ వెలుపల ప్రాంతాలకు డైవర్ట్ చేస్తుంది. శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలతో రిజర్వాయర్ ఖాళీ అవుతోంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ఆధారపడ్డ జల విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. రోజుకు 10 టిఎంసి ల చొప్పున 20 రోజులలో 200 టీఎంసీలు డైవర్ట్ చేసే సామర్థ్యముండటంతో తెలంగాణలోని ఇన్బేసిన్ అవసరాలకు విఘాతం కలుగుతోంది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయి
నీటి ప్రవాహాలను ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలి. తుంగభద్ర నుండి అవార్డు అనుగుణంగా ప్రవాహాలు కృష్ణా నదికి రావాల్సి ఉన్నా రాకుండా ఎపి అడ్డుకొంటుందని ఉత్తమ్ ఆరోపించారు. .శ్రీశైలం రిజర్వాయర్ అడుగు నుంచి (+797 అడుగుల వద్ద) రోజుకు 3 టిఎంసిల నీటిని అవతల బేసిన్కు లిఫ్ట్ చేసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభమయ్యే ముందు పూర్వ స్థితికి పునరుద్ధరించమని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలి. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ డిశ్చార్జ్ కెపాసిటీని అనధికారికంగా పెంచుకుంది. 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకునేలా ఏర్పాట్లు చేసుకుంది. 44 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కెనాల్ కు ఇటీవల 89 వేల క్యూసెక్కులకు పెంచుకుంది. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని 7 ఉమ్మడి జిల్లాలలో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు తాగునీటిని అందించేందుకు ప్రతిపాదించింది. 2010లోనే కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు అనుమతించింది. 2016లో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడున్న 20 టీఎంసీల కేటాయింపులను 80 టిఎంసి పెంచాలి.
గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటా
గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి 80 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు సర్దుబాటు చేయాలి. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏఐబీపీ కింద ఆర్ధిక సాయం అందించాలి. జాతీయ నదుల అనుసంధాన ప్రణాళికలో భాగంగా ఇచ్చంపల్లి కావేరి లింక్ కెనాల్ ప్రతిపాదనలున్నాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి 148 టీఎంసీల నీటి బదిలీలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ 2024 మార్చిలో లేఖ రాసింది. గోదావరి బేసిన్ నుండి ఇతర బేసిన్లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరముంది. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టమని జిడబ్ల్యుడిటి పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టు కేంద్రం నిధులు సమకూర్చాలని ఆయన కోరారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Murder: కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య