Exhibition shops gutted in

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది

Advertisements

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంతో పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిబిషన్‌ లో అనేక మంది సందర్శకులు ఉన్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగినప్పటికీ, మంటలను అదుపులోకి తేవడం కొంతసమయం పట్టింది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

fire in Vijayawada

ఈ అగ్నిప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఎగ్జిబిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్, వాణిజ్య వస్తువులు మొత్తం మంటల్లో చిక్కుకుని నాశనమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత సీఐడీ, ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందా? లేదా ఏ ఇతర కారణం ఉండదా అన్నది పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తేలనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోఘటనలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి ఇంజిన్ పూర్తిగా కాలిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు నుంచి పల్నాడు జిల్లాలోని క్రోసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి ఇంజిన్‌ పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ఘటనలో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts
చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ
chinmaya krishna das

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను Read more

రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్టు
A new project of realty company Brigade Enterprises

హైదరాబాద్‌: దిగ్గజ రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.4500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లొ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించింది. కోకపేట్లోని నియోపోలిస్ సమీపంలో 10 ఎకరాల్లో 'బ్రిగేడ్ Read more

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Another case registered against Vallabhaneni Vamsi

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత Read more

నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్
Gyanesh Kumar as the new Election Commissioner

నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. Read more