Pension :ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం

Pension :ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హామీతో కూడిన పెన్షన్ అందించే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్ ) ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే కాకుండా కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఏ) విడుదల చేసింది.యూపిఎస్ ద్వారా 23 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఓ పిఎస్) తరహాలో హామీతో కూడిన పెన్షన్ అందించబడుతుంది. 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పిఎస్ ) కింద ఉన్నప్పటికీ, అందులో ఫిక్స్ డ్ పెన్షన్ లేకపోవడంతో పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్) ని అమలు చేయాలని నిర్ణయించింది.

యూపిఎస్ లో చేరే విధానం

యూపిఎస్ ప్రస్తుత ఉద్యోగులు.
2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులు, ఎన్ పిఎస్ ను సెలెక్ట్ చేసుకున్న వారు యూపిఎస్ లో చేరవచ్చు.యూపిఎస్ లో చేరాలంటే ఫారం ఏ2 నింపి సమర్పించాలి.

కొత్తగా నియమితులు

2025 ఏప్రిల్ 1 లేదా ఆ తరువాత సర్వీసులో చేరిన కొత్త ఉద్యోగులు ఈ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇందుకు వీరు ఫారం ఏ1 నింపాలి.

రిటైర్డ్ ఉద్యోగులు,

ఎన్ పిఎస్ కింద పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా యూపిఎస్లో చేరవచ్చు.ఇందుకు కెవైసి డాక్యుమెంట్స్‌తో పాటు ఫారం బి2ని సమర్పించాలి.

ఉద్యోగి మరణించిన సందర్భంలో

ఉద్యోగి మరణించిన సందర్భంలో, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి యూపిఎస్ లో చేరవచ్చు.కెవైసి పత్రాలు, ఫారం బి6 సమర్పించాలి.

deccanherald 2024 08 07 5ccw5wv5 iStock 824132644

స్వచ్ఛంద పదవీ విరమణ

యూపిఎస్ లో విఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు 25 సంవత్సరాల సర్వీసు నిబంధన వర్తిస్తుంది.
వీరికి 60 ఏళ్లు నిండే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

యూపిఎస్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

అన్ని వర్గాల ఉద్యోగులకు రిజిస్ట్రేషన్, క్లెయిమ్ ఫారాల భర్తీ ప్రక్రియ సిఆర్ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది:సిఆర్ఏ వెబ్‌సైట్ఆన్‌లైన్ లేదా భౌతికంగా ఫారం సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది.

యూపిఎస్ లో చేరలేని ఉద్యోగులు

తొలగింపు, రాజీనామా, లేదా సర్వీసు రద్దు అయిన ఉద్యోగులు ఈ పథకంలో చేరలేరు.
ఇప్పటికే ఎంపిక చేసుకున్న పెన్షన్ స్కీమ్ మార్చుకునే అవకాశం లేదు.

యూపిఎస్ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు

ఫిక్స్డ్ పెన్షన్ హామీతో ఉద్యోగ భద్రత పెరుగుతుంది.ఎన్ పిఎస్ కంటే అధిక స్థాయిలో ప్రభుత్వ సహకారం అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ప్రభుత్వ మొత్తం సహకారం 28.5% ఉండటంతో పథకం మరింత స్థిరంగా ఉంటుంది.సేవకాలం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది,కుటుంబానికి కూడా పెన్షన్ అందించే విధానం ఉంది.

Related Posts
నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren took oath as Jharkhand CM today

రాంచీ: నేడు జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంగా అట్టహాసంగా జరగబోతోంది. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం Read more

ప్రధాని మోదీని కలిసిన గుకేశ్
gukesh meets modi

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. చెస్‌లో తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గుకేశ్, ఈ సందర్భంగా మోదీతో Read more

కత్తితో బీభత్సం సృష్టించిన దుండగుడు
కత్తితో బీభత్సం సృష్టిస్తున్నదుండగుడు

ఓ సీరియల్ కిల్లర్ నగరంలో బీభత్సం సృష్టించాడు. కనిపించినవారిని, ఎదురొచ్చిన వారిని కత్తితో దాడి చేశాడు. అరగంటలో ఐదుగురిపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో నగరం మొత్తం Read more

మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు

జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 9) మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *