ktr revanth

సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే – కేటీఆర్

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్య మంత్రివన్నీ డొల్లమాటలేనని సీఎం రేవంత్ ఫై కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటని ప్రశ్నించారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభమని, రేవంత్ చేతకానితనం అన్నదాతలకు కోలుకోని శాపమని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘‘20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ??

అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ??. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం. రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం’’ అని కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

Related Posts
అమరావతి లో సినిమాలకు ఫుల్ డిమాండ్ – చంద్రబాబు
chandrababu

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం భారతీయ Read more

మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.
మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రాంతంలో 19 జనవరి ఆదివారం సాయంత్రం ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేలి జరిగినట్టు తెలుస్తోంది.గీతా Read more

వంట నూనెల ధరలకు చెక్: నిర్మలా సీతారామన్
cooking oil

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక Read more

ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్నిరాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్
Let's grow as one.. Shriram Finance launched the campaign with Rahul Dravid

హైదరాబాద్‌: శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి Read more