Everyone is changing their mother tongue.. Kishan Reddy

మాతృభాషను అందరూ మార్చిపోతున్నాం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదన్నారు. 121 భాషలు మన దేశంలో ఉన్నాయన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవని.. ఇవాళ ఆ సంఖ్య మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 భాషలకు పెరిగిందని వెల్లడించారు. ఈ భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్ పేయి నేతృత్వంలో ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారని గుర్తుచేశారు. జ్ఞానాన్ని ప్రసరింప జేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగిందని.. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినప్పుడు దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారిందన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారని తెలిపారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా ప్రధాని మోడీ 2020లో ఎన్‌ఈపీ -2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారని వెల్లడించారు.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అధికార భాషల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టామన్నారు. దీని ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లో అధికారిక అవసరాల కోసం.. కశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీని వినియోగించేలా చట్టం తీసుకొచ్చామని అన్నారు. మోడీ ప్రభుత్వంలో జరిగిన ఎన్‌ఈపీ-2020 ద్వారా స్థానీయ భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. మొదట్లో దీన్ని విమర్శించిన వారు కూడా.. ఇప్పుడు సమర్థిస్తున్నారని చెప్పారు. విద్యావిధానం సులభతరం అవుతుందని, మాతృభాషలో విద్య ద్వారా వికాసం సాధ్యమవుతుందన్న వివిధ అధ్యయనాల ఆధారంగానే మోడీ సర్కారు ముందుకెళ్తోందని చెప్పుకొచ్చారు.

Related Posts
Tulsi Gabbard : భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది – తులసీ గబ్బార్డ్
tulsi gabbard

అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్, రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై తన గాఢమైన భక్తిని వ్యక్తం చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANI న్యూస్ Read more

పవన్ కల్యాణ్ అటవీ శాఖలో సమగ్ర మార్పులు పర్యవేక్షణ
పవన్ కల్యాణ్ అటవీ శాఖలో సమగ్ర మార్పులు పర్యవేక్షణ

గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇప్పుడు తన దృష్టిని అటవీ శాఖపై సారించారు. Read more

గ్రూప్-1 అభ్యర్థులపై కేసులు పెట్టొద్దు – సీఎం రేవంత్
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. 'కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. Read more

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి..క్యాబినెట్ విస్తరణ పై చర్చ జరుగనుందా..?
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం Read more