రేపు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి : చంద్రబాబు

అమరావతి: ప్రతి ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి.. దీనిపై రాబోయే రోజుల్లో మానిటర్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా మహిళా సాధికారితను మాటల్లో చెప్పడం కాదని.. చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారిత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కుకు తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేసారు.

Advertisements
ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి : చంద్రబాబు
చంద్రబాబు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని తెలిపారు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశామని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.

మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం.

డీలిమిటేషన్ పూర్తయితే దాదాపు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని తెలిపారు సీఎం చంద్రబాబు. పసుపు, కుంకుమ కింద రూ.10 వేల చొప్పున రూ.9,689 కోట్లు ఇచ్చాం. మహిళలకు భద్రత, నమ్మకాన్ని కలిగించాం. తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డ్వాక్రాలో మహిళలు రూపాయి పొదుపు చేస్తే నేనూ రూపాయి ఇచ్చాను. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Related Posts
వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను Read more

Kamal Haasan : నటుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం ?
Actor Kamal Haasan to be a Rajya Sabha member?

Kamal Haasan: విలక్షణ నటుడు , మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఎంపీ గా (రాజ్యసభ సభ్యుడిగా) పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. Read more

Wine: మద్యం బ్రాండ్ ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
Wine: మద్యం బ్రాండ్ ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ.30 వేల కోట్ల మార్క్‌ను దాటేసాయి. రాష్ట్రంలో కొత్త మద్యం విధానాలు, బ్రాండెడ్ Read more

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో- న్యాయవాది మృతి
Lawyer dies of heart attack in Telangana High Court

ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్ హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి Read more

×