EPACK Prefab took on the challenge of building a factory building in 150 hours

150 గంటల్లో నిర్మిత ఫ్యాక్టరీ భవనాన్ని నిర్మించే సవాలును స్వీకరించిన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్..

న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులైన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్, అధునాతన ప్రిఫ్యాబ్ మరియు పీఈబీ సాంకేతికతను ఉపయోగించి రికార్డు స్థాయిలో 150 గంటల్లో భారతదేశపు అత్యంత వేగవంతమైన ఫ్యాక్టరీ భవన నిర్మాణాన్ని నిర్మించాలనే తన ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. నవంబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

దాదాపు 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితంకానున్న ఈ ప్రాజెక్ట్ నిర్ణీత ఈప్యాక్ ప్రీఫ్యాబ్ యొక్క వినూత్న PEB సాంకేతికత పై ఆధారపడనుంది. నాణ్యత, మన్నిక లేదా పర్యావరణ ప్రమాణాలపై రాజీపడకుండా భారతదేశం యొక్క అత్యవసర మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చటానికి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాల సామర్థ్యాన్ని హైలైట్ చేయడం ఈప్యాక్ ప్రీఫ్యాబ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రయత్నం గురించి ఈప్యాక్ ప్రీఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. “ఈప్యాక్ ప్రీఫ్యాబ్ వద్ద, మేము వినూత్న నిర్మాణ పద్ధతుల ద్వారా పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను సృష్టించాలనుకుంటున్నాము. ఈ 150-గంటల ఛాలెంజ్ చురుకైన, స్థిరమైన మరియు అధిక-నాణ్యత కలిగిన భవన పరిష్కారాల పై మా లక్ష్యంను ఉదహరిస్తుంది. మా బృందం ప్రతి దశలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ప్రతి దశను ఖచ్చితంగా ప్లాన్ చేసింది. PEB సాంకేతికత భారతీయ నిర్మాణ పరిశ్రమకు తీసుకురాగల వేగం, సామర్థ్యం మరియు స్థిరత్వంను ప్రదర్శించడానికి మేము సంతోషిస్తున్నాము..” అని అన్నారు.

150 గంటల ప్రాజెక్టును మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో, ప్రాథమిక నిర్మాణం ముందుగా నిర్మించిన భాగాలను ఉపయోగించి నిర్మించబడుతుంది. రెండవ దశ రూఫింగ్ పూర్తి చేయడం . చివరి దశ క్లాడింగ్, ఇంటీరియర్ ఫినిషింగ్‌లు మరియు ఇతర అంశాలపై దృష్టి పెడుతుంది, ఫలితంగా 150-గంటల టైమ్‌లైన్‌లో పూర్తిగా పనిచేయగల ఆకృతి ఏర్పడుతుంది.

Related Posts
హీరోయిన్ తో స్టార్ హీరో ఎఫైర్..?
Star hero affair with heroi

ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, క్రమంగా తన ప్రతిభను చూపిస్తూ పాన్-ఇండియా స్థాయికి చేరుకున్న హీరో, తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్‌తో ప్రేమలో Read more

తెలంగాణలో తొలి GBS మరణం
gbs cases maharashtra

తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తో తొలి మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన 25ఏళ్ల వివాహిత ఈ వ్యాధికి బలైంది. నెలరోజుల Read more

మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు – మంత్రి సీతక్క
minister sithakka

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకం కింద సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సహాయాన్ని మహిళల Read more

మహా కుంభమేళాలో గాయకుల ప్రదర్శనలు
Performances by singers at

ఈనెల 13వ తేదీ నుంచి మహా కుంభమేళా భక్తుల ప్రారంభం కాబోతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మేళాకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మంది భక్తులు గంగానది Read more