Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ ఘనవిజయం సాధించడంతో ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని నేరుగా చెన్నై చేరుకోవడం విశేషం. రాజకీయంగా విజయ్ పార్టీకి ఆమె మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే త్రిష విజయ్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేయడం చర్చనీయాంశమైంది.
Read also: Kerala Road Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

Tamil Nadu Elections 2026: పాత వీడియోతో మొదలైన రచ్చ
విజయ్ విజయోత్సాహంలో త్రిష పాలుపంచుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో ఒక పాత వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాల గురించి త్రిష పంచుకున్న విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వీడియో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అసలు ఫేవరెట్ హీరో ఎవరు
ఆ ఇంటర్వ్యూలో త్రిష తన మనసులోని మాటను బయటపెట్టారు. అందరూ విజయ్ పేరు చెబుతారని ఆశించగా, ఆమె మాత్రం అజిత్ తన ఫేవరెట్ హీరో అని స్పష్టం చేశారు. విజయ్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా చార్మింగ్ పర్సన్ అని, మంచి నటుడని ప్రశంసించారు. అలాగే విజయ్ సేతుపతి నటన కూడా తనకు ఎంతో ఇష్టమని త్రిష పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో రాణిస్తున్న వేళ, అజిత్‌ను తన అభిమాన హీరోగా ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: