Singheetam Srinivasa Rao: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సింగీతం అంత్యక్రియలు

Follow Us: Google News Daily Hunt
The funeral of renowned director Singeetham Srinivasa Rao will take place in Chennai on Sunday at 3 PM. Kamal Haasan paid tribute to him and made emotional remarks.
The funeral of renowned director Singeetham Srinivasa Rao will take place in Chennai on Sunday at 3 PM. Kamal Haasan paid tribute to him and made emotional remarks.
FONT SIZE
GET APP

Singheetam Srinivasa Rao: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం.

Read Also :Singeetam Srinivasa Rao Passes Away: సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

సింగీతం భౌతికకాయానికి కమల్ హాసన్ నివాళి

Singheetam Srinivasa Rao

సింగీతం శ్రీనివాసరావు పార్థివదేహానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సింగీతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ఆయన ఎప్పుడూ యువకుడిలా ఉత్సాహంగా ఉండాలని కోరుకునేవారు. అలాగే జీవించారు. ఆయన ఎప్పటికీ యంగే.. శరీరం మాత్రమే ఓల్డ్” అంటూ కమల్ హాసన్ భావోద్వేగానికి గురయ్యారు.

Singheetam Srinivasa Rao: సింగీతం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో 8 సినిమాలు

సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో వీరి కాంబినేషన్ సినీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆయన మృతితో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు