Donga Na Koduku Teaser: టీజర్ రిలీజ్.. నవంబర్ 13న థియేటర్లలోకి మౌళి మూవీ!

Follow Us: Google News Daily Hunt
The teaser for ‘Donga Naa Koduku,’ starring Mouli Tanuj Prashanth, has been released. Directed by Srinu Kambala, this robbery-themed crime comedy is set to hit theaters on November 13.
The teaser for ‘Donga Naa Koduku,’ starring Mouli Tanuj Prashanth, has been released. Directed by Srinu Kambala, this robbery-themed crime comedy is set to hit theaters on November 13.
FONT SIZE
GET APP

Donga Na Koduku Teaser: #90స్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన మౌళి తనూజ్ ప్రశాంత్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘Donga నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రాబరీ క్రైమ్ కామెడీ మూవీ టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను నవంబర్ 13న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Also:Nayanthara Mahasakthi: ‘మహాశక్తి’గా లేడీ సూపర్‌స్టార్.. పవర్‌ఫుల్ లుక్‌తో నయనతార!

బీటెక్ మధ్యలో ఆపేసిన యువకుడిగా మౌళి

Donga Na Koduku Teaser

‘Donga నా కొడుకు’ టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమాలో మౌళి తనూజ్ కొత్త తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసిన యువకుడిగా ఆయన నటిస్తున్నారు. రాబరీ, క్రైమ్, కామెడీ అంశాల కలయికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో సుస్మితా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మౌళి తల్లిదండ్రుల పాత్రల్లో రజిత, అలీ కనిపించనున్నారు. రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Donga Na Koduku Teaser: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తాజాగా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. సినిమాను నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మౌళి తనూజ్ ఈసారి రాబరీ క్రైమ్ కామెడీతో ఎలాంటి వినోదాన్ని అందిస్తారో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు