enforcement directorate investigation will start from today on this formula race

ఫార్ములా ఈ రేసుపై నేటి నుండి ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేసుపై నేటి నుంచి ఈడీ విచారణ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి మరికాసేపట్లో ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ ఈడీ ముందు హాజరుకానున్నారు.

ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.

ఈ కేసులో డిసెంబర్ 19న యాంటీ కరెప్షన్ బ్యూరో FIR నమోదు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పుడు మున్సిపల్ కార్పోరేషన్ మంత్రిగా కేటీఆర్ సంతకం చేసినందకు విదేశీ సంస్థకు HMDA నిధులు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి లాభం చేకూర్చలేదనేది కేటీఆర్ వాదన. మరి ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts
మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha star

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వేను నారాయణఖేడ్ ఎమ్మెల్యే Read more

డీఎంకే పార్టీలో చేరిన నటుడు సత్యరాజ్ కుమార్తె
Sathyaraj's daughter Divya

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ అధికార డీఎంకే పార్టీలో చేరారు. ఈరోజు చెన్నైలో జరిగిన ప్రత్యేక Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh dies

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 నుంచి 1996 వరకు అప్పటి Read more

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
indra sena reddy

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 Read more