elon musk

నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సర్కార్‌ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫిషియెన్సీ’(డోజ్‌) విభాగం అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం కోసం మస్క్‌ అభ్యర్థిత్వానికి సంబంధించిన పిటిషన్‌ నోబెల్‌ కమిటీకి చేరింది. ఈ విషయాన్ని యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.

సేవకు పట్టం నోబెల్

ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని అందజేస్తారు. 1968లో స్వీడన్ బ్యాంక్ 300వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసి, 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్‌గా పిలుస్తారు. నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతికి ప్రారంభంలో 1,50,782 స్వీడిష్ క్రోనార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.6.7 కోట్లు) ఇస్తున్నారు. –ప్రతి ఏడాది నోబెల్ బహుమతిని ఒక్కో రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు.

Related Posts
ఆంధ్రాకు టెస్లాను రప్పించే పనిలో చంద్రబాబు
ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు

ఇప్పటికే ఏపీలో కియా కార్ల కంపెనీ ఉండటంతో ఆటో రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈవీ రంగాన్ని Read more

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్
south korea president

దక్షిణ కొరియాలో రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ కొరియా దర్యాప్తు సంస్థ అధికారులు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు బిగ్ షాక్ Read more

ఢీకొన్న విమానం-హెలికాప్టర్..
plane collides with chopper midair in washington

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్‌ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం పొటోమాక్ నదిలో కుప్పకూలింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ Read more

తిమింగళం నోటిలో పడిన బోటు..
తిమింగళం నోటిలో పడిన బోటు

సముద్ర ప్రయాణం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో.. అప్పుడప్పుడూ అంతే స్థాయిలో భయాన్నీ కలిగిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా సొర చేపలు, తిమింగళాల రూపంలో ప్రమాదం పొంచి Read more