Small relief for AAP.. CM Atishi's win

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే: ఆతిశీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పార్టీ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్‌ సహా కీలక నేతలైన మనీశ్‌ సిసోడియా, సత్యేంద్రజైన్‌, సౌరభ్‌ భరద్వాజ్‌ ఓటమి పాలయ్యారు. కీలక నేతల్లో సీఎం ఆతిశీ ఒక్కరే గెలుపొందారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె సమీప ప్రత్యర్థిపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

image

ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే అని.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. కానీ సెలబ్రేట్‌ చేసుకునే సమయం కాదు. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల ఫలితాలు ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బే. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమాద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 23 స్థానాల్లో ఆప్‌ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.

Related Posts
ఒక్క‌ ఆటోలో 19 మంది ప్ర‌యాణికులు..
ఒక్క‌ ఆటోలో 19 మంది ప్ర‌యాణికులు..

ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధార‌ణ త‌నిఖీల్లో Read more

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై భాగస్వామ్యం..
UN Development Program and The Coca Cola Foundation partner to boost plastic waste management in Asia

ఆసియాలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పరంగా పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడటానికి ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ పోగ్రామ్(UNDP) మరియు ది కోకా-కోలా ఫౌండేషన్ (TCCF) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వేగవంతమైన Read more

అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ
అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసారం చేసిన "మన్ కీ బాత్" కార్యక్రమంలో తన 117వ ఎపిసోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ దిగ్గజాలు రాజ్ Read more

మరోసారి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సీనియర్ నేతలు తప్పుకోవాలి – రాజా సింగ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజా సింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ Read more