Election of TDP candidate as Deputy Mayor of Tirupati

తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవిని ఎన్డీయేలోని టీడీపీ కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ సెనెట్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ, కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ మునికృష్ణ విజయం సాధించారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లుండగా 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో 3 ఖాళీలున్నాయి. డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు 26 మంది కావాల్సి ఉండగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, తన 21 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరై డిప్యూటీ మేయర్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా భాస్కర్‌ రెడ్డిని పోటీ చేయించారు. అయితే టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

image

డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడవచ్చనే అనుమానంతో వైసీపీ నాయకులు ముందస్తుగా భద్రత కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతిలో144 సెక్షన్‌ అమలు చేస్తూ 30 పోలీసు యాక్టును అమలు చేసినట్లు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. గొడవలు సృష్టించేవారికి నోటీసులు అందజేశామని వివరించారు.

Related Posts
మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభం
మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇక మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి నిర్మాణ పనులు వేగంగా కొనసాగనున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ Read more

విడదల రజనికి స్వల్ప ఊరట
HC provides relief to ex minister Vidadala Rajani in SC, ST Atrocity Case

అమరావతి: విడదల రజని ఆదేశాల మేరకే ఇబ్బంది పెట్టారంటూ కోటి పిటిషన్.మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముందస్తు Read more

బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
amrapali kata

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం ఇటీవల అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు Read more

మహాసేన రాజేష్ తండ్రి కన్నుమూత లోకేష్ సంతాపం
మహాసేన రాజేష్ తండ్రి కన్నుమూత లోకేష్ సంతాపం

టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్ తండ్రి మరణం: విషాదంలో పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఇంట విషాదం తగిలింది. ఆయన తండ్రి సరిపెళ్ల సాధు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *