ఎనిమిదవ తరగతి విద్యార్థి సూసైడ్

ఎనిమిదవ తరగతి విద్యార్థి సూసైడ్

ఉప్పల్ : 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ ద్వారక నగర్ కు చెందిన ధర్మారెడ్డి,సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి ఉప్పల్ న్యూ భారత్ నగర్ లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఉదయం క్లాస్ రూమ్ లో పిటి ఆంజనేయులు వచ్చి ఇష్టం ఉన్నట్టు మందలించి కొట్టడంతో మనస్థాపానికి గురై క్లాస్ టీచర్ కి వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే స్కూల్ కరస్పాండెంట్ దగ్గర్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి చనిపోయాడని నిర్ధారణ చేశారు.మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూలుకు చేరుకున్నారు. స్కూల్ యజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు.విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూలు విద్యార్థులు ఆందోళనకు దిగారు.సమాచారం తెలవగానే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
నేడు పోలీసుల విచారణకు అల్లు అర్జున్..!
Allu Arjun will be questioned by the police today.

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన Read more

వెబ్సైట్ నుంచి కుటుంబ సర్వే ఔట్.. KTR సెటైర్లు
KTR Family

తెలంగాణలో ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన "కుటుంబ సర్వే" పత్రం ఇప్పుడు రాజకీయ వివాదాస్పదంగా మారింది. ఈ సర్వేలో అనేక తప్పులున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి Read more

అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది – పొంగులేటి
ponguleti runamafi

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమవుతుందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇటీవల కురిసిన భారీ Read more

ఈఆర్సీ చైర్మన్‌గా దేవరాజు నాగార్జున
Devaraju Nagarjuna as ERC C

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించారు. బుధవారం, జీఎస్టీ కాలనీలో ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈఆర్సీ పాలకమండలి Read more