Students Skill : సర్టిఫికెట్లు కాదు, విద్యార్థులకు నైపుణ్యం ముఖ్యం

Follow Us: Google News Daily Hunt
Students Skill
Students Skill
FONT SIZE
GET APP

Students Skill : ఒకప్పుడు విద్య ఉద్యోగానికి మార్గం. నేడు విద్య ఉద్యో గానికి హామీ కాదు. ఇదే ఇరవై ఒకటో శతాబ్దపు అతి పెద్ద సామాజిక, ఆర్ధిక వైరుధ్యం. ప్రతి సంవత్సరం లక్ష లాది మంది యువత డిగ్రీలు, పీజీలు, వృత్తిపరమైన అర్హ తలు సంపాదించి ఉద్యోగ విపణిలోకి ప్రవేశిస్తున్నారు. అయి నప్పటికీ నిరుద్యోగం తగ్గడం లేదు. అదే సమయంలో వారి శ్రమలు మాత్రం పనికి సిద్ధంగా ఉన్న నైపుణ్యం కలిగిన యువత దొరకడం లేదు’ అని వాపోతున్నాయి. ఒకవైపు సర్టిఫికెట్లు పెరుగుతుంటే, మరోవైపు సామర్థ్యం కొరత కొనసాగుతోంది. సమస్య ఉద్యోగాల్లో లేదు. సమస్య విద్య లో లేదు, సమస్య ఈ రెండింటి మధ్య తెగిపోయిన సం బంధంలో ఉంది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ నైపుణ్యాలను కోరు తున్న వేళ, మన విద్యా వ్యవస్థ ఇంకా సర్టిఫికెట్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ వైరుధ్యాన్ని అర్ధం చేసుకోవాలంటే ముందు భారత ఉన్నత విద్య విస్తరణను చూడాలి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎన్హెచ్) ప్రకారం దేశంలో 4.3 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నత విద్యలో ఉన్నారు.

Read Also : Instagram Ban: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కానుందా? వైరల్ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత!

Students Skill
Students Skill

Students Skill : ఉద్యోగ యోగ్యత విస్తరణ

ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థల్లో భారత్ ఒకటి. స్వాతంత్ర్యం తర్వాత విద్యను ప్రజలకు చేరువ చేయడంలో ఇది గొప్ప విజయమే. ఇది విద్యఅందు బాటులోకి వచ్చిందనే విజయాన్ని సూచిస్తుంది. కానీ అదే విద్య ఆర్థికవ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలుగా మారకపో వడమే అసలు ఆందోళన. అందుకే విద్యా విస్తరణ, ఉద్యోగ యోగ్యత విస్తరణగా మారలేదు. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం సుమారు సగం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే పరిశ్రమలకు వెంటనే ఉపయోగపడే స్థాయిలో ఉన్నారు. అంటే సమస్య చదువుకున్న వారి సంఖ్యలోలేదు. వారు సంపాదించిన విద్య, ఉద్యోగ మార్కెట్కు అవసరమైన సామర్థ్యంగా మారకపోవడంలో ఉంది. ఇక్కడే డిగ్రీల ద్రవ్యో ల్బణం అనే భావన ప్రాధాన్యం సంతరించుకుం టుంది. ద్రవ్యోల్బణంలో కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గినట్లే, డిగ్రీలు విపరీతంగా పెరిగినప్పుడు వాటి ప్రత్యేకత కూడా తగ్గు తుంది. ఒకప్పుడు ఇంటర్ లేదా డిప్లొమాతో లభించిన ఉద్యో గానికి ఇప్పుడు డిగ్రీ అవసరమవుతోంది. నిన్న డిగ్రీ సరి పోతే, నేడు పీజీ కోరుతున్నారు. ఉద్యోగ స్వభావం అంతగా మారకపోయినా, విద్యార్హతలు మాత్రం పెరుగుతున్నాయి. డిగ్రీలు జ్ఞానాన్ని కొలిచే సాధనంగా కాకుండా, అభ్యర్థులను వడపోసే సాధనంగా మారుతున్నాయి.

మానవ మూల ధనం

ఆర్థిక శాస్త్రంలో 2001 నోబెల్ బహుమతి గ్రహీత మైకేల్ స్పెన్స్ ఈ పరి స్థితిని దాదాపు అర్ధశతాబ్దం క్రితమే వివరించాడు. ఉద్యోగం ఇవ్వబోయే సంస్థకు అభ్యర్థి నిజంగా ఎంత సమర్థుడో ముందుగానే తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే అది డిగ్రీని ఒక సంకేతంగా ఉపయోగిస్తుంది. మంచి డిగ్రీ అంటే నేర్చుకునే సామర్థ్యం, క్రమశిక్షణ. పట్టుదల ఉన్న వ్యక్తి అని భావిస్తుంది. కానీ అదే డిగ్రీ లక్షల మందికి వచ్చినప్పుడు ఆ సంకేతం బలహీనపడుతుంది. అప్పుడు మరింత ఉన్నత విద్యార్హతలను కోరడం ప్రారంభమవు తుంది. ఇదే డిగ్రీల ద్రవ్యోల్బణానికి మూల కారణం. సమస్య విద్యార్థుల్లోలేదు. విద్యను ఎంపిక ప్రమాణంగా ఉపయో గించే వ్యవస్థలో ఉంది. ఆర్ధిక శాస్త్రంలో 1992 నోబెల్ బహుమతి గ్రహీత గ్యారీ బెకర్ విద్యను మానవ మూల ధనంగా అభివర్ణించాడు. యంత్రాల్లో పెట్టుబడి పెడితే ఉత్పత్తి పెరిగినట్లే, విద్యపై పెట్టుబడి పెడితే మనిషి ఉత్సా దకత పెరగాలి. కానీ విద్య సామర్థ్యాన్ని పెంచకుండా కేవ లం సర్టిఫికెట్ను మాత్రమే ఇస్తే, అది మానవ మూల ధనంగా మారదు. నేడు భారత్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే. మనం విద్యలో పెట్టు బడి పెడుతున్నాం, కానీ ఉత్పాదకతలో అదే స్థాయి పెరు గుదల కనిపించడం లేదు. డిగ్రీల సంఖ్య పెరుగుతోంది. కానీ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అదే వేగంతో పెరగడం లేదు. అందుకే విద్య విస్తరిస్తున్నా, ఆర్ధిక వ్యవస్థకు అవసరమైన మానవ మూలధనం అదే వేగంతో పెరగడం లేదు. ఇది కేవలం విద్యావ్యవస్థ వైఫల్యం కాదు. ఇది సమాజం నిర్మిం చుకున్న ఒక ఆలోచనా విధాన ఫలితం.

సమస్యలను కొత్త కోణంలో చూడడం

దశాబ్దాలుగా భార తీయ కుటుంబాల్లో ‘మంచి డిగ్రీ అంటే మంచి ఉద్యోగం’ అనే సమీకరణ బలంగా స్థిరపడింది. పాఠ శాలలు మార్కుల కోసం, కళాశాలలు డిగ్రీల కోసం, విద్యా ర్థులు ఉద్యోగాల కోసం పరుగు తీశారు. కానీ ప్రపంచఆర్ధిక వ్యవస్థ అంత లోనే మారిపోయింది. నేడు ఉద్యోగదాత అడుగుతున్న ప్రశ్న ‘ఏ డిగ్రీ చేశావు?’ కాదు. ‘ఏం చేయగలవు?’ అన్నది. ఈ మార్పును మరింత వేగవంతం చేసింది కృత్రి మ మేధ. గత పారిశ్రామిక విప్లవాలు శారీరక శ్రమను భర్తీ చేశాయి. కానీ కృత్రిమ మేధ విశ్లేషణ, సమాచార ప్రాసెసింగ్, పున రావృత మేధోపరమైన పనులను కూడా స్వీకరిస్తోంది. అందువల్ల పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం కంటే, సమస్యలను కొత్త కోణంలో చూడడం, వేగంగా నేర్చుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, విభిన్న రం గాల జ్ఞానాన్ని అనుసంధానించడం వంటిసామర్ధ్యాలే ఎక్కువ విలువ పొందుతున్నాయి. ప్రపంచ ఆర్ధిక నివేదిక విడు దల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు-2025 ఈ మార్పు ను స్పష్టంగా ప్రతిబింబించింది. 2030నాటికి ఉద్యోగాలకు అవసరమైన ప్రధాన నైపుణ్యాల్లో దాదాపు 39శాతంమార్పు వస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడగా, 9.2 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ గణాంకా లు ఉద్యోగాల సంక్షోభాన్ని కాదు, నైపుణ్యాల సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు డిగ్రీల ఆధారంగాకాదు, నైపుణ్యాల ఆధారంగా మానవ వనరులను అంచనా వేయ డం ప్రారంభించింది. భారత్కు ఈమార్పు మరింత కీలకం. ప్రతి సంవత్సరం ఒక కోటినుంచి 1.2కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇదే మన జనాభా ప్రయోజనం. కానీ నైపుణ్యాలుగా మారని విద్య ఈజనాభా ప్రయోజనాన్ని నిరుద్యోగ భారంగా మార్చేప్రమాదం ఉంది.

Students Skill
Students Skill

నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆర్ధిక విలువగా మారుస్తుంది

ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు వేల సంఖ్యలో ఇంజినీర్లు, పీజీలు దరఖాస్తు చేస్తుండగా, మరోవైపు పరిశ్రమలు శిక్షణ పొందిన వెల్డర్లు, యంత్ర నిర్వహణ నిపుణులు, డేటా విశ్లే షకులు, సైబర్ భద్రత నిపుణులు, కృత్రిమ మేధ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నాయి. చదువుకున్న నిరుద్యోగం, నైపు ణ్యాల కొరత ఒకేసారి కనిపించడం కంటే పెద్ద హెచ్చరిక ఇంకేముంటుంది? విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆర్ధిక విలువగా మారుస్తుంది. ఈ రెండింటిమధ్య సంబంధం తెగిపోయినప్పుడు డిగ్రీల ద్రవ్యోల్బణం ప్రారంభ మవుతుంది. అందుకే సంస్కరణలు కూడా విద్యార్థులతో మొదలై విద్యార్థుల దగ్గరే ముగియ కూడదు. విశ్వవిద్యా లయాలు పరిశ్రమలతో కలిసి పాఠ్యాంశాలను రూపొందిం చాలి. శిక్షణను మార్కుల కోసం చేసే కార్యక్రమంగా కాకుండా, ఉద్యోగానికి సిద్ధం చేసే ప్రక్రియగా మార్చాలి. పరిశ్రమలు కూడా శిక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. సమాజం డిగ్రీని గౌరవించినంతగా నైపుణ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. భారత్ 2047 నాటికి అభి వృద్ధి చెందిన దేశంగా మారాలంటే మరిన్ని విశ్వవిద్యాల యాలు నిర్మించ డం ఒక్కటేసరిపోదు. మరిన్ని డిగ్రీలు ఇవ్వడం కూడా సరి పోదు. విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్లు ముద్రించే కేంద్రాల నుంచి మానవ మూలధనాన్ని తీర్చి దిద్దే కేంద్రాలుగా మారాలి, భారత్ అభివృద్ధి చెందిన దేశం గా ఎదగడాన్ని నిర్ణయించేది విశ్వవిద్యాలయాలు ఎన్ని డిగ్రీలు ఇచ్చాయన్నది కాదు, ఎన్ని సమస్యలను పరిష్క రించగల మనుషులను తీర్చిదిద్దాయన్నదే.

-డి.వి.బి శ్రీహరిన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు