Instagram Ban: భారతదేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) నిషేధానికి గురికాబోతోందంటూ గడచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది.
Read Also :Elon Musk: ‘ఎక్స్’లో బ్యాంకింగ్ సేవలు.. ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం
ప్రచారంలో నిజం లేదు: పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కానుందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కానీ, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ ‘మెటా’ (Meta) కానీ ఇలాంటి ప్రకటనలు చేయలేదని పీఐబీ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
Instagram Ban: తప్పుడు వార్తలను నమ్మవద్దు!

సోషల్ మీడియా వేదికలపై వ్యాప్తి చెందే ఇటువంటి రూమర్ల పట్ల ప్రజలు మరియు నెటిజన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోకుండా ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద వార్తల నిజానిజాలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా సరిచూసుకోవాలని కోరింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :