Save forest : చుట్టూ పర్యావరణ దీపాలు వెలిగిద్దాం

Follow Us: Google News Daily Hunt
Save forest
Save forest
FONT SIZE
GET APP

Save forest : వృక్షో రక్షతి రక్షితః’ అన్నది కేవ లం ఒక సూక్తి కాదు మానవాళి మనుగడకు ప్రాణాధారమైన పర్యా వరణ వేదవాక్యం. మన సంస్కృతి లో చెట్టు ఒక దేవత, అడవి ఒక జీవధాత్రి, ప్రకృతి ఒక పరమేశ్వరుడి ప్రతిరూపం. అరణ్యాలు లేనిదేమానవ జాతికి ఉనికి లేదు. భారతదేశం ప్రకృతి ప్రసాదించిన అపారమైన అరణ్య సంపదతో, అనన్యమైన జీవ వైవిధ్యంతో, సహ్యాద్రి, వింధ్య, హిమాలయ పర్వత సాను వుల నుంచి నదీ పరీవాహక ప్రాంతాల వరకు పచ్చని చీర కట్టిన పుణ్యభూమిగా ప్రపంచ పటంలో విలసిల్లుతోంది. అడవి అంటే కేవలం నిశ్శబ్దంగా నిలబడే వృక్షాల సముదా యం మాత్రమే కాదు, సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు ను అందించే ఊపిరితిత్తులు, నేలకు జీవం పోసి ఎడారీక రణను నిలువరించే రక్షాకవచం, నదీనదాలకు జన్మనిచ్చే జలభాండాగారం, కోట్ల సంఖ్యలోని జీవరాశులకు మాతృ సమానమైన ఆశ్రయం. అలాంటి ప్రకృతి వరప్రసాదాన్ని, అపురూపమైన వన్య పాణులను, అమూల్యమైన అటవీ సంపదను కాపాడే పవిత్ర యజ్ఞంలో తమ రక్తమాంసాలను ధారపోసి, ప్రాణాలనే మూల్యంగా చెల్లించిన అటవీయోధుల నిరుపమాన త్యాగాలను స్మరించుకునే మహత్తర సందర్భమే సెప్టెంబర్ 11న దేశమంతటా అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించుకునే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం.

Read Also : 5 Orangutans Found In Odisha : 5 ఒరాంగుటాన్‌లు వన్యప్రాణుల స్మగ్లింగ్ బాధితులు కావచ్చు: ఇండోనేషియా

Save forest
Save forest

Save forest : ప్రకృతిని ప్రాణసమానం గా ఆరాధించే..

ఈ దినోత్సవం వెనుక ఉన్ననేపథ్యం సాధారణమైనదికాదు, అది మనిషికి, ప్రకృతికి మధ్య గల విడదీయరాని ఆత్మీయ బంధాన్ని లోకానికి చాటిచెప్పిన రక్తతర్పణ గాథ. దాదాపు మూడు శతాబ్దాల క్రితం, 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్ లోని జోధ్పూర్ సమీపానగల ఖేజర్లీ అనే పల్లెసీమలో జరి గిన మహోజ్వల ఘట్టం భారత పర్యావరణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అప్పటి మార్వార్ సంస్థాన పాలకుడు మహారాజా అభయ్ ్సంగ్ తన నూతన రాజప్రా సాద నిర్మాణంలో సున్నం కాల్చడానికి కలప అవసరమై, సైనికులను పచ్చని చెట్లను నరికి తీసుకురమ్మని ఆదేశించా డు. సైనికుల గొడ్డళ్లు భేజర్లీ గ్రామంలోని పవిత్రమైన భేబ్రీ (జమ్మి) చెట్లవైపు దూసుకొచ్చాయి. ప్రకృతిని ప్రాణసమానం గా ఆరాధించే బిష్ణోయీ సమాజానికి ఆ చెట్లను నరకడం దేవాలయ విధ్వంసంతో సమానం. ఆ విషమ ఘడియల్లో అమృతాదేవి అనే సాహస వనిత శిరస్సు తెగిపడినా సరే, ఒక్క చెట్టు ప్రాణమైనా దక్కితే అది చౌకైన బేరమే” (సిర్ సాంటే రూఖ్ రహేతో భీ సస్తో జాణ్) అంటూ గొడ్డలి వేటుకు ఎదురొడ్డి వృక్షాన్ని తన గుండెలకు హత్తుకుంది. క్రూరమైన సైనికుల గొడ్డలి ఆమె ప్రాణాలను బలిగొన్నప్ప టికీ, ఆ త్యాగజ్వాల చల్లారలేదు. ఆమె వెంటే ఆమె ముగ్గు రు కుమార్తెలు, వారిని చూసి గ్రామానికి చెందిన బిష్ణోయీ వీరులు ఒకొ ఒక్కరుగా పచ్చని చెట్లను తమ శరీరాలతో కౌగిలించుకుని రక్షణ కవచాలుగా నిలిచారు. అలా 363 మంది అమాయక అమరజీవులు మూగచెట్ల పరిరక్షణ కోసం తమ నిండు పాణాలను నవ్వుతూ తృణప్రాయంగా అర్పించారు.

చిప్కో ఉద్యమానికి మూలస్తంభం

ఒక చెట్టు కోసం వందలాది మానవ దేహాలు నేలకొరిగిన ఈ అపూర్వ త్యాగమే తర్వాతి కాలంలో సుందర్లాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్ వంటి మహనీయుల నేతృ త్వంలో సాగిన ప్రఖ్యాత చిప్కో ఉద్యమానికి మూలస్తంభం గా, అంతర్జాతీయ పర్యావరణ పోరాటాలకు ఆధ్యంగా నిలిచింది. భేజర్లీ వీరుల బలిదానానికి గుర్తుగా సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా అధికారి కంగా పరిగణించడం వెనుక సరైన చారిత్రక స్పష్టత అవ సరం. చాలాచోట్ల ఈ దినోత్స వాన్ని కేంద్రప్రభుత్వం 2001 నుంచే అమలులోకి తెచ్చిందన్న ప్రచారం ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ 2013 మే 7న జారీ చేసిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తూ ఉత్త ర్వు ఇచ్చింది. దేశవ్యాప్తంగా దుర్బ రమైన అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ కలప దొంగలు, స్మగ్లర్లు, వేటగాళ్లు, నక్సలైట్లు, అడవి జంతువుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతు న్న అటవీ సిబ్బందికి జాతీయ స్థాయిలో అత్యున్నత గౌర వం కల్పించాలనే సమున్నత లక్ష్యంతో ఈనిర్ణయం తీసుకున్నారు. దెహ్రాదూన్లోని ప్రఖ్యాత అటవీ పరిశోధనా సంస్థ (ఎఫ్.ఆర్.ఐ) ప్రాంగణంలోని ఫారెస్టర్ మెమోరియల్ వద్ద ప్రతి ఏటా అమరవీరుల శిలాఫలకం ముందు రక్షణ దళాల మాదిరిగానే గాల్లోకి కాల్పులుజరిపి గౌరవ వందనంసమర్పిం చడం ఒక పవిత్ర సంప్రదాయంగా వస్తోంది.

దేశ అంతర్గత సహజ సంపద

సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే సైనికుడి త్యాగం ఎంతటి పవిత్రమైనదో, దేశ అంతర్గత సహజ సంపదను, భవిష్యత్ తరాల ప్రాణ వాయువును కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిం చే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజర్లు, వాచర్లు చేసే ప్రాణార్పణ కూడా అంతే దేశభక్తి పూరితమైనది. నిప్పు లు చెరిగే దావానలాలు, విషసర్పాలు, క్రూరమృగాలు, ఏకే47 తుపాకులతో తిరిగే ఎర్రచందనం, టేకు స్మగ్లర్ల వంటి ముఠాలను కనీస ఆయుధాలు లేకుండానే ఒట్టి చేతులతో, లాఠీలతో ఎదుర్కొంటూ విధి నిర్వహణలో నెత్తురు చిందిస్తు న్న అటవీ అమరుల త్యాగనిరతి అసాధారణమైనది. ప్రస్తుత ఆధునిక యుగంలో పర్యావరణ సంక్షోభం తీవ్రతరమవుతు న్న వేళ అటవీ విస్తీర్ణ గణాంకాలను నిశితంగా విశ్లేషించుకో వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారత అటవీ సర్వే సంస్థ విడుదల చేసిన భారత అటవీ స్థితి నివేదిక 2023 ప్రకారం దేశంలో మొత్తం అటవీ కవచం, వృక్ష కవచం కలిపి దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24శాతానికి పైగా నమోదైంది. ఇందులో కేవలం అటవీ కవచం సుమారు 21.76 శాతంగా విస్తరించి ఉండగా, చెట్ల కవచం మిగిలిన భాగాన్ని ఆక్రమి స్తోంది. గత నివేదికలతో పోల్చినప్పుడు దేశవ్యాప్తంగా అటవీ కవచంలో 156.41 చదరపు కిలోమీటర్లు, వృక్ష కవచంలో 1,289.40 చదరపు కిలోమీటర్ల మేర వృద్ధి నమోదై, మొత్తంగా 1,445.81 చదరపు కిలోమీటర్ల పెరుగుదల కనిపిం చినట్లు కేంద్ర నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

Save forest
Save forest

అడవుల క్షీణతను అరికట్టి

జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33శాతం లక్ష్యాన్ని చేరుకోవడా నికి మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. కేవలం లెక్కల్లో విస్తీర్ణం పెరిగినంత మాత్రాన సంబరపడి పోతే సరి పోదు. ఆ పెరుగుదల పచ్చని సాంఘిక అడవుల రూపంలోనో లేదా వాణిజ్య తోటల రూపంలోనో కాకుండా, సహజ సిద్ధమైన దట్టమైన అరణ్యాల రూపంలోవిస్తరిస్తోందా లేదా అన్నదే ప్రాథమిక ప్రశ్న. సహజ అరణ్యాల్లో విలసిల్లే వృక్ష, లతా, గుల్మ, పక్షి, జంతు, కీటక జాలాల సమతుల్య త ఏకజాతి వృక్ష పెంపకాల్లో లభించదు. స్థానిక వృక్షజాతు లను రక్షిస్తూ, అడవుల క్షీణతను అరికట్టి, అటవీ కారిడార్ల ను పునరుద్ధరించినప్పుడే నిజమైన పర్యావరణ భద్రతసాధ్య మవుతుంది. వాతావరణ మార్పులు పెనుభూతమై ప్రపంచాన్ని వణికిస్తున్న నేటి తరుణంలో అడవుల సంరక్షణ మానవ మనుగడకు జీవన్మరణ సమస్యగా మారింది. అడవిని కాపాడ టం అనేది అటవీశాఖ అధికారుల బాధ్యత మాత్రమేకాదని, ఈ నేలపై జన్మించిన ప్రతి పౌరుడి పవిత్ర ధర్మమని సమా జం గుర్తించాలి. మనఇంటి ప్రాంగణంలో నాటే ప్రతిమొక్క, కాపాడే ప్రతి వృక్షం, నిలిపే ప్రతి నీటిబొట్టు ప్రకృతి సమ తుల్యతకు తోడ్పడతాయి. అమృతాదేవి. 363 మందిబిష్ణోయీ వీరులు తమప్రాణాలను పణంగా పెట్టి వెలిగించిన పర్యా వరణ దీపం తరతరాలగుండెల్లో నిరంతరం ప్రజ్వరిల్లాలి.

-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు