Government schools : ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పెరగాలి

Follow Us: Google News Daily Hunt
Government schools
Government schools
FONT SIZE
GET APP

Government schools : ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రధాన వేదికలు. కానీ నేడు అనేక ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య తగ్గి పోవడంతో వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోం ది. ఒకవైపు పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, మరో వైపు ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు ప్రైవేటు విద్యా సంస్థల ఆకర్షణ ఇవన్నీ ప్రభుత్వ విద్యావ్యవస్థకు నవాళ్లు గా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. కొన్ని చోట్ల తరగతి గదులు ఉన్నా విద్యార్థులు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. పాఠశాలల్లో చేరికలు తగ్గడానికి కేవలం తల్లిదండ్రుల ప్రైవేటు విద్యపై మోజును కారణంగా చూపడం సరైంది కాదు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా సదుపాయా లు వంటి అంశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వాటి అమలులో వేగం, నాణ్యత కీలకం, పాఠశాల భవనాలు నిర్మించడం ఒక్కటే సరిపోదు. ప్రతి బడిలో విద్యార్థుల అవసరాలకు అనుగు ణంగా మౌలిక వసతులు కల్పించాలి.

Read Also : NEET PG 2026 Answer Key: త్వరలోనే ఆన్సర్ కీ.. 2.65 లక్షల మంది అభ్యర్థులకు కీలక అప్‌డేట్

Government schools
Government schools

Government schools : ప్రభుత్వ బడులే నాణ్యమైన ప్రత్యామ్నాయం

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయి లో నిరంతరం పర్యవేక్షించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమైన అంశం. విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పాఠశాలలను మూసివేయ డం లేదా విలీనం చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ఎందుకు విద్యార్థులు తగ్గుతున్నారు అనే ప్రశ్నకు సమా ధానం వెతకాలి. పాఠశాలపై తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల కమి టీలు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలు కలిసి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన కేంద్ర విద్యాశాఖ ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ ప్లస్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2,081 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్ మెంట్ నమోదైంది. దేశవ్యాప్తంగా 5,149 ప్రభుత్వ పాఠ శాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోగా, వాటిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. నల్లగొండలో 315, మహ బూబాబాద్లో 167, వరంగల్లో 135, రంగారెడ్డి లో 99, సూర్యాపేటలో 94, సిద్దిపేటలో 84, నాగర్కర్నూల్ లో 81, ఇలా తెలంగాణలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాల లు 2,081 వున్నాయి. ప్రభుత్వ విద్య బలపడితేనే సామా జిక సమానత్వం సాధ్యమవుతుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ప్రైవేటు విద్య భారంగా మారకుండా ప్రభుత్వ బడులే నాణ్యమైన ప్రత్యామ్నాయంగా నిలవాలి. అందుకు ‘బడికి విద్యార్ధి రావాలి’ అనే లక్ష్యంతోపాటుబడిపై తల్లిదండ్రులకు నమ్మకం రావాలి’ అనేదిశలో ప్రభుత్వంచర్య లు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాల అనేది కేవలం ఒకభవనం కాదు, అదిసమాజ భవిష్యత్తును నిర్మించే పునాది. ఆ పునాది బలహీనపడితే దాని ప్రభావం రేపటి తరాలపైపడుతుంది. కాబట్టి సర్కారుబడులు విద్యార్థులతో కళకళలాడేలా చేయ డం ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం బాధ్యత. a

-డాక్టర్ మోటె చిరంజీవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు