Old age : వృద్ధాప్యం భారమా! బాధ్యతా?

Follow Us: Google News Daily Hunt
Old age
Old age
FONT SIZE
GET APP

Old age : వృద్ధులు కుటుంబానికి భారం కాదు, తరాలకు బలం. ఒకప్పుడు ఇంట్లో తాతయ్య, నానమ్మ ఉంటే ఆ కుటుంబానికే ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. వారి మాటకు విలువ, అనుభవానికి ప్రాధాన్యం ఉండేది. పండుగలు, పర్వదినాలు, ఆచారాలు, కుటుంబ విలువలు ఒక తరం నుంచి మరోతరానికి చేరేది వారి ద్వారానే. కానీ మారు తున్న జీవనశైలి, పట్టణీకరణ, ఉద్యోగ అవసరాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీ ణించడం వంటి పరిణామాలతోవృద్ధుల పరిస్థితి క్రమంగా మారుతోంది. భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ.. పితృదేవోభవ అనే భావనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావించిన సమాజంలోనే నేడు కొందరు వృద్ధులు ఒంటరితనం, నిర్లక్ష్యం, ఆర్ధిక అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ మాట్లాడేవారు లేక పోవడం, ఆరోగ్య సమస్యల సమయంలో తోడుండేవారు లేకపోవడం మరింత బాధాకరం. భారతదేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2023లో యుఎన్ఎఫ్ఎ్పఎ విడుదల చేసిన నివేదిక ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 15.3 కోట్లు ఉండగా, 2050 నాటికి అది 34.7 కోట్లకు చేరవచ్చని అంచనా. వృద్ధుల్లో సుమారు 40 శాతం అత్యల్ప సంపద వర్గంలో ఉండటం, దాదాపు ఐదో వంతు మందికి సొంత ఆదాయం లేకపోవడం వారి ఆర్థిక భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రపంచ పరిస్థితి కూడా ఆందోళనకరమే.

Read Also : Tiruchanur Elephant Attack: తిరుచానూరులో ఆలయం ఏనుగు దాడిలో గాయపడిన మావటి మృతి

Old age
Old age

Old age : వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ చర్యలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సమాజంలో నివసిస్తున్న 60 ఏళ్లు పైబడిన వారిలోదాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు గత ఏడాదిలో ఏదో ఒక రూపం లో వేధింపులకు గురైనట్లు అంచనాలు చెబుతున్నాయి. వృద్ధాశ్రమాలు, దీర్ఘకాలిక సంరక్షణ సంస్థల్లోనూ దుర్వి నియోగం నమోదవుతున్నట్లు డబ్ల్యుహెచి పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు అవసరమైన ఆశ్ర యాలుగా మారుతున్నాయి. అయితే వృద్ధాశ్రమం కుటుం బానికి ప్రత్యామ్నాయం కాకూడదు. నిజంగా అవసరమైన వారికి అవి భద్రత, వైద్యం, ఆహారం, మానవీయ సహకా రం అందించే కేంద్రాలుగా ఉండాలి. అదే సమయంలో కుటుంబాలు తమ బాధ్యత నుంచి తప్పించుకునే మార్గం గా వాటిని చూడకూడదు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం కేవలం వ్యక్తిగత సమస్య కాదు. అది సామాజిక విలువలసమస్య. తెలంగాణలోనూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అధికారిక గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్ నాటికి 16.36 లక్షలకు పైగా వృద్ధాప్య పింఛన్లు నమోదయ్యాయి. వృద్ధులకు వైద్య సేవలు అం దించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 17 మొబైల్ మెడికేర్ యూనిట్లు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది. అయితే పింఛను, వైద్యం మాత్రమే వృద్ధాప్య భద్రతకు సరిపోవు. వారికి కావాల్సింది ఆత్మీయత, గౌరవం, సంభాషణ, నిర్ణయాల్లో భాగస్వామ్యం. వారానికి ఒకసారి తల్లిదండ్రులతో మాట్లాడ టం, వారి ఆరోగ్యాన్ని తెలుసుకోవడం, పండుగలను కలిసి జరుపుకోవడం వంటి చిన్న చర్యలే వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలవు. నేడు మనం వారిని ఎలా చూసుకుంటామో రేపు మన వృద్ధాప్యంలో సమాజం మనల్ని ఎలా చూడాలో అదే ప్రమాణంగా నిలుస్తుంది. వృద్ధాశ్రమాలు పెరగడం కంటే వృద్ధుల పట్ల ఆప్యాయత పెరగాలి. అదే భారతీయ సంస్కృతికి నిజమైన గౌరవం.

-డాక్టర్ మోటె చిరంజీవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు