APERC Chairman: ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా బినోయ్ కుమార్

Follow Us: Google News Daily Hunt
APERC Chairman
APERC Chairman
FONT SIZE
GET APP

APERC Chairman: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) నూతన చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యుత్ రంగంలో పారదర్శకత, నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించే దిశగా ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : APPSC గ్రూప్-1 కేసు.. 7 చోట్ల ఈడీ తనిఖీలు

APERC Chairman:
Binoy Kumar appointed as new Chairman of APERC

APERC Chairman: ఐదేళ్ల పాటు పదవీ కాలం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బినోయ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా ఆయనకు 70 ఏళ్ల వయస్సు నిండే వరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) ఈ పదవిలో కొనసాగుతారు. రానున్న కాలంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీల లెక్కింపు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ, విద్యుత్ సంస్థల పనితీరు పర్యవేక్షణ వంటి కీలక అంశాల్లో ఆయన పాత్ర ప్రాధాన్యం సంతరించుకోనుంది.

మూడేళ్ల సుదీర్ఘ అనుభవం.. విద్యుత్ రంగంపై పట్టు

బినోయ్ కుమార్‌కు ఐఏఎస్ అధికారిగా పరిపాలనా రంగంలో విశేష అనుభవం ఉంది. ఆయన మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక బాధ్యతాయుతమైన పదవులను నిర్వర్తించారు. 2012-13 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, నిబంధనల అమ‌లు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ఆయనకు సుదీర్ఘ అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి.

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడం, నష్టాలను తగ్గించడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో బినోయ్ కుమార్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు