hanging: నచ్చిన వాళ్ల తలనిమరడం, నచ్చకపోతే శిరచ్చే దానికైనా వెనుకాడకపోవడం ఒక జాతి లక్షణం కాకూడదు. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం అటువంటి ధోరణిలోనే వ్యవహరిస్తోంది. ఎక్కడా పట్టువిడుపుల్లేని వైఖరి. ఎంత అత్యాధునిక సాంకేతిక సంపన్నులను కున్నా శత్రువులను ఊచకోత కోయాలనుకునే ఆలోచన మంచిది కాదు. ఒకేదేశంలో ఒకేరకం నేరాలకు ఒకే రకమైన శిక్ష ఉంటుందని అనుకుంటాం. కానీ ఇజ్రాయెల్ మాత్రం తమ వారికైతే ఓ రకం శిక్షతమ జాతికి వ్యతిరేకులన్న భావంతో ఇతర జాతీయులకు మరో రకం శిక్షను ప్రతిపాదించి వారిలోని కాఠిన్యాన్ని బయటపెట్టుకుంది. ప్రాణాంతక దాడులకు పాల్పడిన పాలస్తీనియన్లకు ఉరి శిక్ష అమలు చేసేందుకు వీలుగా ఉన్న వివాదాస్పద బిల్లు ను ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదించడం జాతి ద్వేషం ఎలాంటిదో నిరూపించింది. ఈ వివాదాస్పద బిల్లును అనుకూలంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుసహా 62 మంది ఓటేస్తే 48 మంది ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు.
Read Also : Tadiandamol Trekking Missing Case: కొండల ట్రెక్కింగ్ మిస్సింగ్..4 రోజుల తర్వాత దొరికిన కేరళ మహిళ!

hanging: శిక్షలు అనుభవించాల్సిందే.
మెజార్టీ సభ్యులు అనే విధానంలో ఈ బిల్లుకు అనుమతి లభించింది. ఈ బిల్లు ప్రకారం ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో నివసించే పాలస్తీనియన్లు ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులకు ఇజ్రాయెల్ మిలటరీ కోర్టులు ఉగ్రవాదచర్యగా భావిస్తే నిందితులకు మరణశిక్ష అమలు చేయనున్నారు. ఈ చట్టంపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. మద్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముదిరిన మాట వాస్తవమే అయినప్పటికీ జాతిద్వేషంతో శిక్షల స్థాయిని మార్చడం అంగీకరించేట్లు లేదు. జాతి ద్వేషంతో నిర్దాక్షి ణ్యంగా ఊచకోత కోయాలనో ఉరిశిక్షతో ఈలోకాన్నుంచే పంపేయాలనో కత్తికడితే ఆ జాతిని రక్షించేది ఎవరు. తప్పులు చేసినవారు నేరాలకు పాల్పడిన వారు శిక్షలు అనుభవించాల్సిందే. నేరస్థులకు శిక్షలు వేసేది వారిలో పరివర్తన తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే శిక్షాస్మృతులు రూపొందుతాయి. అంతే తప్ప జాతి నెపమున ద్వేష చిత్తులై ఇజ్రాయెల్ పాలకులు పాలస్తీనియన్లను ఊరికంబమెక్కించడం ఎవరూ మెచ్చరు. ఇలాంటి కఠిన చర్యల వల్ల మానవ క్రౌర్యాన్ని పరివర్తన దిశగా నడిచే అవకాశాన్ని పొగొట్టిన వారవుతారు. అలాంటి నిర్ణయాలు ఎప్పటికైనా బెడిసికొట్టాయి. ఈ చట్టాన్ని పాలస్తీనా ఖండించింది.
ప్రాంతీ య స్థిరత్వానికి ముప్పు
అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తా యి. ఈ చట్టంలో ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ముప్పు ఏర్పడినట్లేనని బ్రిటన్, ఫాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ తోపాటు ఐరోపాదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అన్ని విషయాల్లోనూ ఇజ్రాయెల్‌తో అంటకాగుతున్న అమెరికా ప్రభుత్వం మాత్రం సార్వభౌమాధికారం కిందే ఇలాంటి శిక్షలపై నిర్ణయాధికారం ఉండటంతో తప్పేమీ లేదన్నారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లకు నిలువ నీడలేకుండా చేసినిందితులుగా నిర్ధారణ చేసి ఉరికంబమెక్కిం చాలని చేసే ఏ ప్రయత్నాన్నీ అంగీకరించబోమని, పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఇండోనేషియా, జర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ తదితర దేశాల విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొ న్నారు. ఇజ్రాయెల్ తెచ్చిన ఈ చట్టం వల్ల మధ్య ప్రాచ్యంలో శాంతిప్రక్రియకు పూర్తి విఘాతమని, ప్రాంతీ య స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం అంతర్జాతీయ చట్టాలకు, ప్రాథమిక మానవ హక్కులకు పూర్తి విరుద్ధమని ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తు న్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీలు తిండితిప్పలు లేక మగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితు ల్లో పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా చట్టసవరణ చేసి పాలస్తీనియన్లపై ప్రయోగించేందుకు కొత్తచట్టాన్ని తేవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందేవస్తుందని అభిప్రాయ పడ్తున్నారు. పాల స్తీనియన్లను వివక్షాపూరితంగా శిక్షిం చాలన్న దురుద్దేశ్యంతోనే చట్టంలో పొందుపరిచారని ఆ ఏడుదేశాలు విమర్శిస్తున్నాయి. ఇలా ఇజ్రాయెల్ విధానా లన్నీ పాలస్తీనియన్ల ఊచకోత కోసమేనని భావిస్తున్నాయి. ఇది పూర్తిస్థాయి అణచివేతకు పరాకాష్ఠ. ఖైదీలపై పెరుగుతున్న అమానుష దాడులను ఆయాదేశాలు ఎండ కట్టాయి. ఇజ్రయెల్ పార్లమెంట్ (క్నెస్సెట్) ఆమోదించిన నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రపంచదేశా లు కోరుతున్నాయి.

మానవత్వమే ముఖ్యమని
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణలు ఎంత హింసాత్మకంగా మారినా గతపాలకులెవరూ పాలస్తీనియన్లపై ‘ఉరి’ వంటి చర్యలేమి తీసుకోలేదు. 1962లో ఒక యుద్ధనేరస్తుడి ఉరితీత మాత్రమే జరిగింది. కానీ తాజా చట్టం నేరస్తు లుగా చిత్రీకరించి ఏ పాలస్తీనియుడినైనా ఉరితీయగల అధికారం చేతికొస్తుంది. కేవలం పాలస్తీని యన్లను తుద ముట్టించే కిరాతక చర్యకు ఇజ్రాయెల్ పలు దారులు వెతుకుతోందని అర్థమౌతుంది. చాలా దేశాల్లో ‘ఉరి’ శిక్ష రద్దు కోసం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎన్నోఒత్తిడిలు తెచ్చింది. ఉద్యమాలు చేపట్టింది. దాదాపు పదిదేశాల్లో ‘ఉరిశిక్ష రద్దుచేసిన వైనం తెలిసిందే. ఇంత క్రితమే ఆస్కారమున్న ‘ఉరి’ శిక్షల రద్దుకోసం ప్రయత్నాలు జరుగు తున్నా తరుణంలో తాజాగా ‘ఉరి’ శిక్షను చట్టబద్ధం చేసుకునే ఏ చర్యఅయినా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇలాంటి చర్యలను సభ్య దేశాలు ఖండించాల్సిందే. రాజకీయ అణచివేత చర్యల కన్నా మానవత్వమే ముఖ్యమని భావించాల్సిన తరుణం ఆసన్నమైంది. నేరాన్ని నేరంగా, శిక్షని శిక్షగా చూడాలి తప్ప దాని వెనుక జాతి, కుల, మత, ద్వేషాలను కారణా లుగా ఎంచుకోకూడదు. తాజా చట్టం అమలు చేస్తేఇజ్రాయెల్కు పాలస్తీనియన్ల మధ్య శాంతి సదృశ్యమైన పరిష్కారం దొరికే పరిస్థితి కనుచూపు మేరలో లేవట్లే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: