garbage : పర్యావరణ పరిరక్షణకై ‘చెత్త’పై పోరాటం

Follow Us: Google News Daily Hunt
garbage
garbage
FONT SIZE
GET APP

garbage : మహారాష్ట్రలోని మోషి వేస్టు ఎనర్జీ ప్రాజెక్టు వద్ద భారీ వర్షాలకు ఏళ్ల తరబడి పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల కొండ విరిగిపడి పరిపాలనా భవనాన్ని సజీవ సమాధిచేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. కానీ ఈ దుర్ఘట నను కేవలం ప్రకృతి వైపరీత్యంగా చూడడం వాస్తవాన్ని కప్పిపుచ్చడమే అవుతుంది. ప్రకృతి చెత్త కొండలను నిర్మిం చదు. పాలనా నిర్లక్ష్యం, కార్పొరేట్ లాభాల రాజకీయాలు, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలే వాటిని నిర్మిస్తాయి. మోషిలో కూలింది చెత్త కొండ కాదు, ప్రజల భద్రత కంటే లాభాలను ముందుపెట్టిన పట్టణ అభివృద్ధి నమూనా. ఈ హెచ్చరిక మహారాష్ట్రకే పరిమితం కాదు. హైదరాబాద్కు ఇది మరింత దగ్గరగా వినిపించాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 8,000 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని జీహెచ్ఎంసీ స్వయంగా అంగీకరించింది. అంతేకాదు, ఈవ్యర్ధాలను ప్రధా నంగా జవహర్ నగర్ సమీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రం పైనే ఆధారపడి నిర్వహించడం ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016కు అనుగుణం కాదని కూడా అధికారి కంగా పేర్కొంది. అంటే ప్రమాదం గురించి ప్రజలకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్ప టికీ పరిస్థితి ఎందుకు మారడం లేదు?

Read Also : Massive Earthquake : జపాన్లో భారీ భూకంపం.. !

garbage
garbage

garbage : ప్రమాదకర వ్యర్థాలు

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2016 స్పష్టంగా చెబుతున్నాయి. చెత్తను మూలం వద్దనే తడి-పొడి- ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయాలి. నగరాలన్నీ వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అభి వృద్ధి చేయాలి. శాస్త్రీయ ల్యాండ్ఫిల్ చివరి ప్రత్యామ్నా యంగా మాత్రమే ఉండాలి. భారీ చెత్త కొండలను సృష్టిం చడం ఈ నియమాల ఆత్మకు విరుద్ధం. అయినప్పటికీ హైదరాబాద్ నగరమంతా ఉత్పత్తి చేసే వ్యర్థాలను జవ హర్నగర్కు తరలించే కేంద్రీకృత నమూనా కొనసాగుతూనే ఉంది. ఇదే మోషి వంటి ప్రమాదాలకు పునాది. జవహర్ నగర్ కథ కొత్తది కాదు. ఒకప్పుడు మన్సూరాబాద్లో ప్రజలు చెత్త కాలుష్యాన్ని అనుభవించారు. తర్వాత సమ స్యను అక్కడి నుంచి తరలించి జవహర్నగర్కు చేర్చారు. నగరం పెరిగే కొద్దీ ఆటోనగర్, సనత్నగర్, ఇమ్లీబన్ వంటి ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పడ్డాయి. కానీ మూల సమస్యమాత్రం అలాగే ఉంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామా బాద్, మహబూబ్నగర్ వంటి తెలంగాణ నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఒక ప్రదేశం నిండిపోతే మరో ప్రదేశం వెతకడం తప్ప, చెత్త ఉత్పత్తి విధానాన్ని, నిర్వహణ నమూ నాను మార్చే ప్రయత్నం కనిపించడం లేదు. ఇక్కడే ‘చెత్త రాజకీయం’ ప్రారంభమవుతుంది. ప్రతి ఎన్నికల సమయం లో జవహర్ నగర్ ప్రజలకు హామీలు ఇవ్వని రాజకీయ పార్టీఉండదు. డంపింగ్ యార్డు తరలిస్తామని, కాలుష్యాన్ని నివారిస్తామని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెబు తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మౌనం. ఎందుకు? దీనికి సమాధానం కేవలం రాజకీయాల్లో కాదు, రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఉంది.

నియంత్రణ వ్యవస్థ బలహీనం

ఒకప్పుడు మున్సిపల్ పారిశుద్ధ్య పనిగా ఉన్న వ్యర్థాల నిర్వహణ ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆర్థిక రంగంగా మారింది. చెత్త సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, లీడేట్ శుద్ధి, ల్యాండ్ఫిల్ నిర్వహణ, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ప్రతిదశలో భారీ కాంట్రా క్టులున్నాయి. జవహర్నగర్ సమీకృత వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ (ప్రస్తుతం రీ సస్టైన బిలిటీ గ్రూప్లో భాగం) దీర్ఘకాలంగా భాగస్వామిగా ఉంది. జిహెచ్ఎంసి రాంకీ భాగస్వామ్యం 2009లో కుదిరిన కన్సె షన్ ఒప్పందం కింద అమలవుతోందని ప్రభుత్వ పత్రాలే చెబుతున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న వేయడం ప్రజాస్వామ్య హక్కు, వేల కోట్ల ప్రజాధనం, దశాబ్దాల ఒప్పందాలు, కార్పొరేట్ భాగస్వామ్యాలు ఉన్న ఈరంగంలో ప్రజారోగ్యం, పర్యావరణ భద్రతకు ప్రాధాన్యం దక్కుతోందా? లేక కాం ట్రాక్టుల నిరంతరత్వానికా? ఈ ప్రశ్నను మరింత తీవ్రతరం చేసింది కాగ్ నివేదిక, ప్రాసెస్ చేయని వ్యర్థాలకు కూడా భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని, పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలున్నాయని, నియంత్రణ వ్యవస్థ బలహీ నంగా ఉందని అది పేర్కొంది. అంతటితో ఆగలేదు. జవ పార్నగర్లో తాజా వ్యర్థాల దంపింగ్పై ఎన్సోటి ఇచ్చిన ఆదేశాల అమలులో లోపాలపై జిహెచ్ఎంసి, రాంకీ రెం డింటినీ సంయుక్తంగా బాధ్యులుగా పేర్కొంటూ జరిమానా కూడా విధించింది. ఇది కేవలం పరిపాలనా లోపం కాదని, బాధ్యత ప్రశ్నను తప్పించలేమని సూచించే పరిణామం. ఇక్కడితో సమస్య ముగియదు. ఈమొత్తం వ్యవస్థను పర్య వేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పాత్ర మరింత ఆం దోళన కలిగిస్తోంది.

garbage
garbage

శాశ్వత పరిష్కారాలు కనిపించడం లేదు

ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు2016 అమలును నిర్ధారించడం స్థానిక సంస్థలతో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టిజిపిసిబిబాధ్యత కూడా. లీచేట్ శుద్ధి, భూగర్భ జలాల నాణ్యత, ల్యాండ్ఫిల్ గ్యాస్ నియంత్రణ, గాలి కాలుష్య ప్రమాణాలు, పర్యావరణ అనుమతుల అమలు వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ జరగాలి. కానీ జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రజలు ఏళ్లుగా దుర్వాసన, కలుషిత నీరు, పొగ, ఈగలు, దోమలు, ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు వ్యక్తంచేస్తున్నప్పటికీ, వాటికి తగిన స్థాయిలో శాశ్వత పరిష్కారాలు కనిపించడం లేదు. చెత్త లోని రసాయనాలు, లోహాలు, విష పదార్థాలు కలిసిన ఈ కలుషిత ద్రవం వర్షాల సమయంలో భూమిలోకి ఇంకితే భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పర్యా వరణ నిపుణులు సంవత్సరాలుగా ఇదే హెచ్చరిక చేస్తున్నారు. పైకి కనిపించేది చెత్త కొండ మాత్రమే. కానీ కింద నిశ్శ బ్దంగా కలుషితమవుతున్నది నేల, నీరు, చివరకు ప్రజల ఆరోగ్యం. ఈ కాలుష్యానికి అత్యధిక మూల్యం చెల్లిస్తున్న వారు ఎవరు? నగర సంపదను నిర్మించే శ్రమజీవులే. దంపింగ్ యార్డులు, ట్రాన్స్ ఫర్ స్టేషన్లు, వ్యర్థాల ప్రాసె సింగ్ కేంద్రాలు ఎక్కు వగా దళితులు, బీసీలు, గిరిజనులు, ముస్లింలు, వలన కార్మికులు, అసంఘటిత రంగ శ్రామి కులు నివసించే ప్రాం తాలకే చేరువలో ఉన్నాయి. అదే నగరంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ఆలోచనే ఎందుకు రాదు? వ్యాధులు, చర్మసమస్యలు, కలుషిత నీటి ప్రభావాలు అణ గారిన వర్గాలకా? ఇదే నేటి చెత్త రాజకీయం. ఈ రాజకీ యాన్ని మార్చకుండా దంపింగ్ యార్డులు మారినా, ప్రభు త్వాలు మారినా, ప్రమాదాలు మాత్రం మారవు. అందుకే చెత్తపై పోరాటం పారిశుద్ధం కోసం మాత్రమే కాదు, ప్రజల జీవించే హక్కుకోసం, పర్యావరణ న్యాయం కోసం, రాజ్యాం గబద్ధమైన సమానత్వం కోసం సాగాల్సిన ప్రజా ఉద్యమం.


-పాపని నాగరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు