Fee reimbursement : ఫీజు బకాయిల్లో విద్యార్థుల భవిష్యత్తు!

Follow Us: Google News Daily Hunt
Fee reimbursement
Fee reimbursement
FONT SIZE
GET APP

Fee reimbursement : విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నేడు అనేకప్రశ్నలను ఎదుర్కొం టోంది. 2020-21 నుంచి 2024-25 విద్యా సంవత్స రాల వరకు బకాయిలు పేరుకుపోవడం విద్యార్థులు, తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనా రిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఈ పథ కం ఎంతో కీలకం. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు సకా లంలో అందకపోవడంతో కొన్ని కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది అదనపు ఆర్థికభారంగా మారు తోంది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం బకాటలు రూ.8 వేల కోట్లకు పైగానే ఉన్నాయని. ప్రభుత్వం చెబుతుండగా, 2025-26 వరకు కలిపితే రూ.10 వేల కోట్లకు పైగా ఉంటాయని కళాశాలల వర్గాలు పేర్కొంటు న్నాయి. మరోవైపు ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాలపై నిర్ణ యాలు తీసుకుంటున్నప్పటికీ, గత బకాయిల పరిస్థితి మాత్రం స్పష్టంగా తేలాల్సి ఉంది. పాత బకాయిలను పూర్తిగా పరిష్కరించకుండా కొత్త విధానాలను ప్రకటించడం వల్ల సమస్య మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉంది.

Read Also : New Rules: నేటితో ముగియనున్న ITR, LPG కేవైసీ గడువు.. రేపటి నుంచి కొత్త రూల్స్!

Fee reimbursement
Fee reimbursement

Fee reimbursement : నిర్ణీత కాల పట్టికతో చెల్లింపులు

ప్రభుత్వం ఇప్పటికే బకాయిల చెల్లింపుల కోసం భారీ మొత్తాలను విడుదల చేసినట్లు చెబుతున్నప్పటికీ, విద్యార్థుల ఖాతాలు, కళాశాలల బకాయిల స్థాయిలో పూర్తి పారదర్శకత అవసరం. ఫీజు రీయింబర్స్ మెంట్ కేవలం ప్రభుత్వ ఆర్థిక పథకం కాదు. వేలాది మంది పేద విద్యార్థుల భవి ష్యత్తుతో ముడిపడిన సామాజిక బాధ్యత. బకాయిల కార ణంగా విద్యార్థుల చదువుల మధ్యలో ఆగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే కళాశాలల వారీగా బకాయిలను గుర్తించి, దశలవారీగా కాకుండా నిర్ణీత కాల పట్టికతో చెల్లింపులు పూర్తి చేయాలి. బకాయిలు పేరుకుపో వడంతో ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. ఆ ప్రభావం చివరకు విద్యార్థులపైనే పడు తోంది. ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి, సర్టిఫికెట్లు నిలిపి వేయడం వంటి సమస్యలతో చదువు పూర్తిచేసిన విద్యార్థు లు కూడా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వం 2026-27 నుంచి ప్రతి విద్యా సంవత్సరానికి అవసరమైన నిధులను అదే ఏడాది లో విడుదలచేసి, ఇకపై బకాయిలు పేరుకుపోకుండా చర్య లు తీసుకుంటామని ప్రకటించింది. నెలకు రూ.200 కోట్ల చొప్పున విడుదల చేసే కొత్తవిధానాన్ని కూడా ప్రకటించిం ది.

Fee reimbursement
Fee reimbursement

బకాయి లను తక్షణమే చెల్లించాలి

భవిష్యత్తులో ఇలాంటి బకాయిలు పేరుకుపోకుండా ప్రతి విద్యాసంవత్సరం ఫీజురీయింబర్స్ మెంట్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, నిధుల విడుదలకు పటిష్టమైన వ్యవస్థ ను రూపొందించాలి. విద్యార్థుల చదువువారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఆధారపడకూడదు. ఫీజు రీయింబర్స్ మెంట్ లెక్కలు స్పష్టమై, బకాయిలు పూర్తిగా తీరినప్పుడే ఈ పథ కానికి నిజమైన అర్ధం చేకూరుతుంది. ప్రభుత్వం ఇకనైనా కాలయాపనకు తావులేకుండా స్పష్టమైన కార్యాచ రణతో ముందుకు సాగాలి. అర్హులైన విద్యార్థుల బకాయి లను తక్షణమే చెల్లించాలి. ఏ విద్యార్థి సర్టిఫికేట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా ఆగిపోకుండా విద్యార్థులకు అవసరమైనప్పుడు వారికి ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడకుండా భవిష్యత్తులో ప్రతి ఏడాది ఫీజురీయింబర్స్ మెంట్ సకాలంలో అందేలా ప్రత్యేకనిధి, పారదర్శక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థుల భవిష్యత్తు బకాయిల లెక్కల్లో చిక్కుకోకుండా చూడటమే ప్రభుత్వానికి ముందున్న అసలు బాధ్యత.

-డా.మోట చిరంజీవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు