Panchayat : పంచాయతీలను నిర్వీర్యం చేయొద్దు!

Follow Us: Google News Daily Hunt
Panchayat
Panchayat
FONT SIZE
GET APP

Panchayat : జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించే దిశలో అడుగులు వేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పాలకపెద్దలు ఏనాటినుంచో చెప్తున్నా ఆచరణకు వచ్చేసరికి అవి కాగితాలకే మిగిలిపో తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావ స్తున్నా నేటికీ గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది. వాస్తవంగా గ్రామస్వరాజ్యం గురించి స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి ఎందరోనాయకులు ఇవే మాటలు చెప్తూనే ఉన్నారు. వాటి పటిష్టతే తమ ధ్యేయమని పదేపదే ప్రక టనలు గుప్పిస్తున్నారు. వాటికి కేటాయించిన నిధులు, విధులు అప్పగిస్తామని ఎప్పటి కప్పుడు హామీ ఇస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా చూస్తే గ్రామ సర్పంచులకు ఒక వ్యూహంప్రకారం ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. అధికారంలేని ఉత్సవ విగ్రహాలుగా మార్చేందుకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమవంతు కృషి చేస్తున్నా రని చెప్పొచ్చు. చివరకు స్వతంత్రంగా చీపురు కట్టకొనలేని దురదృష్ట పరిస్థితి తెచ్చి పెట్టారు. ఒకనాడు సర్పంచులకు ఉన్న ప్రాధాన్యత నేడు కానరావడం లేదనేది కాదనలేని వాస్తవం. ఇందుకు వారూ వీరు అనే దానికంటే ఎవరు అధికారంలో ఉన్నా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారనే చెప్పక తప్పదు.

Read Also : AP Pensions: ఏపీలో జులై 1 నుండి కొత్త పింఛన్‌లు

Panchayat
Panchayat

Panchayat : సమాంతరంగా పదవులు

గ్రామస్థాయిలో ఎన్నో కమిటీ లను పెట్టి సర్పంచులను పక్కకు పెట్టారు. వారి ప్రమేయం లేకుండానే, వారికి తెలియకుండా ఎన్నో కార్యక్ర మాలు గ్రామాల్లో జరిగే పరిస్థితి తీసుకువచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సర్పంచులకు సమాంతరంగా పద వులు సృష్టించారు. ఇలాంటి చర్యలతో ఉన్న ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. నేతల వాగ్దానాలతో ఏదో సాధిం చాలని సమాజానికి ఏదో చేయాలని నూతనోత్సహంతో ఎందరో యువకులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నో వ్యయప్రయాసలకులోనై సర్పంచులయ్యారు. అప్పట్లో గ్రామాభివృద్ధికి తాముచేసిన వాగ్దానాలు తీర్చేందుకు నడుం కట్టారు. ఈచట్టాల వలలో తాము ఏమీ చేయ లేమనే విషయం అర్ధంకావడానికి వారికి చాలాకాలం పట్టింది. అయితే గ్రామప్రజలకు తాము చేసే వాగ్దానాలు పూర్తి చేసేందుకు తలతాకట్టు పెట్టి అప్పోసొప్పో చేసి కొన్ని గ్రామాల్లో పనులు పూర్తిచేశారు. అయితే బిల్లులు ఎంతకూ రాకపో వడం, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి, ఇంకొకపక్క అప్పులు, వడ్డీలు- పెరిగి, మరొకపక్క గ్రామ స్తుల నుండి తలవంచుకోలేక డజన్ మందికిపైగా తెలం గాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో 2024 జనవరి 31తో వారి పదవీకాలం పూర్తయి మాజీ సర్పంచులైపోయారు. ఆలస్యంగానైనా ఎన్నికలు జరగడంతో కొత్తసర్పంచులు పదవులను అధి ష్టించారు.

అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు

మాజీ సర్పంచుల పరిస్థితి గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారు. ముఖ్యంగా ప్రజాభివృద్ధికి వ్యయం చేసిన డబ్బు రాకపోవడం, వారుపడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఎప్పటికి బిల్లులు వస్తాయో చెప్పేవారు లేరు. అంతా అగమ్యగోచరంగా తయారయిం ది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ మండలం మహమ్మాదాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సర్పంచుగా ఉన్న సమ యంలో గ్రామాభివృద్ధి కోసం చివరకు మామిడితోట విక్ర యించి వచ్చిన డబ్బు, మరికొన్ని అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ డబ్బులు ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ సర్పం చులు కరీంనగర్, ఉస్మాబాద్ ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఇప్పటికీ మరెందరో మాజీ సర్పం చులు తాము చేపట్టిన ప్రజాభివృద్ధి కార్యక్రమాలకు సం బంధించి బిల్లుల కోసం కాలు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడం పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకనాడు పంచాయితీరాజ్ వ్యవస్థలో సర్పంచులు అంటే ఎంతో గౌరవ మర్యాదలుండేవి. భారత దేశంలో స్థానిక సంస్థలకు రెండువేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. చంద్రగుప్తుడి కంటేముందు నుంచి గ్రామాలు, గ్రామ వ్యవస్థ అమలులో ఉన్నట్లు ఆధారాలున్నాయి. అప్పుడు కూడా గ్రామసభలుండేవి.

Panchayat
Panchayat

గ్రామసభల నిర్ణయమే కీలకం

గ్రామసభల నిర్ణయమే కీలకం. వాటి నిర్ణయాలకు ఆనాటి రాజరికవ్యవస్థ ఎంతో ప్రాము ఖ్యత ఇచ్చేది. అలా ప్రాచీనకాలం నుండి గ్రామవ్యవస్థ ఏదోఒక రూపంలో మనదేశంలో కొనసాగుతూనే ఉన్నది. 1882లో బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలకు ప్రతిపత్తి కల్పించారు. గాంధీ మహాత్ముడు ప్రవ చించిన గ్రామస్వరాజ్యం లక్ష్యంలో స్థానిక సంస్థ పటిష్టత అన్నది ఒక ముఖ్యాంశం. భారత రాజ ్యంగంలో కూడా స్థానిక సంస్థలకు అవసరమైన అధికారాలు ఇవ్వడానికి, ప్రభుత్వం చర్యలుతీసుకోవాలని స్పష్టంగా సూచించారు. 1952 నుంచి ఎన్నోకమిటీలు, మరెన్నో అధ్యయనాలు, మార్పులు, చేర్పులు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేశా రు. కానీ సర్పంచులకు రాజ ల్యాంగం కల్పించిన అధికారాలు ఇవ్వడానికి మాత్రం పాలక పెద్దలకు మనసు ఒప్పడం లేదు. రానురాను పంచాయతీరాజ్ వ్యవస్థను నామమా త్రంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నిమార్పులు చేర్పులుచేసు కుంటున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు నేతలు మారినా అధికార వికేంద్రీకరణ మాత్రం ఆది నుంచి అధి కారంలో ఉన్నపెద్దలు మోకాలొడ్డుతూనే ఉ న్నారు. ప్రజా స్వా మ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థ పునాది లాంటిది. అందులో సర్పంచులు కీలకం. రాష్ట్రాలు మరిన్ని అధికారాలు కా వాలని కేంద్ర ముందు గావుకేకలు పెడుతున్న నేతలు స్థానిక సంస్థలకు మాత్రం అధికారాలు ఇవ్వకపోవడం అత్యంత దురదృష్టకరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు