Caste discrimination: విద్యాలయాల్లో కులవివక్షను ప్రక్షాళన చేయాలి

Follow Us: Google News Daily Hunt
Caste discrimination
Caste discrimination
FONT SIZE
GET APP

Caste discrimination: ఒక దేశం తన ఉన్నత విద్యాసంస్థ ల్లో జరిగే కుల వివక్షను స్వయం గా అధ్యయనం చేసి, పంతొమ్మిదేళ్ల తర్వాత అదే వివక్షను మళ్ళీ అధ్య యనం చేయాల్సి రావడం కాకతాళీ యం కాదు. అది ఒక వ్యవస్థతనను తాను దిద్దుకోలేని నిర్మాణాత్మక వైఫ ల్యానికి రుజువు. 2026లో సుఖదేవ్ థోరట్ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీ ఎయిమ్స్ లో 76శాతం మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పరీక్షకులు నేరుగా కులం అడిగినట్లు, 84 శాతం మంది మార్కులు కులం కారణంగా ప్రభావితమయ్యాయని చెప్పినట్లు నమోదు చేసింది. 88శాతం మంది హాస్టళ్లలో సామాజిక ఏకాంత వాసాన్ని అనుభవించారు. ఈ నివేదికను ప్రభుత్వమే స్వ యంగా ఏర్పాటు చేసినప్పటికీ, ఎయిమ్స్ యాజమాన్యం దానిని తిరస్కరిస్తూ ఢిల్లీ 7 హైకోర్టుకెళ్లింది. నాలుగేళ్లపాటు ఏ సిఫారసూ అమలు కాలేదు. ఈ నిర్లక్ష్యానికి మూల్యం ఎవరు చెల్లించారో చరిత్ర చెబుతుంది. అహ్మదాబాద్కు చెందిన ప్లంబర్ కుమారుడు దర్శన్ సోలంక్, ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతూ, తన కులం కారణంగా రూమ్మేట్ల ఎగతాళిని భరించలేక 2023లో ప్రాణం తీసుకు న్నాడు. యాజమాన్యం అతని మరణాన్ని విద్యాపరమైన ఒత్తిడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

Read Also : Vande Mataram : ‘వందేమాతరం’ బిల్లు వ్యతిరేకతపై కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు

Caste discrimination
Caste discrimination

Caste discrimination : చట్టం లేకపోవడం

రూర్కీ ఐఐటీలో వైమానిక దళ అధికారి కుమారుడు మనీష్ కుమార్ గుడ్డ లియన్, తన సహవిద్యార్థుల కుల దూషణలను, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక 2011లోనే ఐదో అంతస్తు నుండి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య పన్నెండేళ్ల అంతరం ఉన్నా కథ ఒక్కటే. వ్యక్తిగత దూషణ చేసేవారిని గుర్తించడం సులభమే, కానీ వారిని కాపాడే సంస్థాగత నిర్మాణాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఈ సంస్థాగత నిర్మాణాన్నే 2025లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని జాతీయ టాస్క్ ఫోర్స్ నిర్ధారించింది. ఢిల్లీ ఐఐటీలో ఆయుష్ అశ్న, అనిల్కుమార్ అనే ఇద్దరు దళిత విద్యార్థుల మరణాలను హత్యలుగా భావించిన తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు లక్షల నలభై మూడు వేల మంది విద్యార్థులను, రెండు వేల నూట పంతొమ్మిది సంస్థలను సర్వే చేసిన ఈ టాస్క్ ఫోర్స్, ఆత్మహత్యల నివారణకు ప్రత్యక్షమైన శాసన పరమైన చట్రం దేశంలో పూర్తిగా లేకపోవడమే అత్యంత స్పష మైన లోపమని పేర్కొంది. 65 శాతం సంస్థల్లో మాన సిక ఆరోగ్య సేవలే లేవు, 73 శాతంలో పూర్తికాల నిపుణుడు లేడు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సంస్థాగత జవాబుదారీతనాన్ని తప్పనిసరి చేసే చట్టాలున్నా. భారత్లో అలాంటి చట్టం లేకపోవడాన్ని టాస్క్ ఫోర్స్ నేరుగా ఎత్తిచూపింది.

గుత్తాధి పత్యం నుండి విముక్తి కలిగించే ఆయుధం

ఐఐటీ మద్రాస్లో పీహెచ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్ మరణానికి కారణమైన అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన తర్వాత ఆ క్యాంపస్ లో మళ్ళీ ఆత్మహత్వ నమోదు కాలేదు. జవాబుదారీతనం చూపిస్తే ఫలితం ఉం టుందనడానికి ఇదొక్కటే మనకు కనిపించే ఉదాహరణ. ఇక్కడే ఈ సమస్య కేవలం దళిత సమస్యగా మిగలదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 నుండి2021 మధ్య ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఆత్మ హత్యకు పాల్పడిన 122 మందిలో 24 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు అయితే, 41 మంది అధికారికంగా ఇతర వెనుకబడిన తరగతులుగా పిలవబడే వర్గానికి చెందినవారు. మొత్తం మరణాల్లో 55 శాతం ఈమూడు వర్గాలవే. అయితే సంస్థల్లో వీరి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తి కంటే చాలా తక్కువ. ‘దళిత ఆదివాసీ బ హుజన మరణాలను వేర్వేరు చూసే ధోరణి, కులం, వర్గం ఏకకాలంలో పనిచేసే అణచి వేత యంత్రాంగాన్ని దాచిపెడుతుంది. జ్యోతిరావు ఫూలే విద్యను శూద్రాతిశూద్రులకు బ్రా హ్మణీయ జ్ఞాన గుత్తాధి పత్యం నుండి విముక్తి కలిగించే ఆయుధంగా చూశాడు. అతని దృష్టిలో పాఠశాల భవనం కేవలం ఇటుకల నిర్మా ణం కాదు, అది సామాజిక అధికార పునఃపంపిణీ వేదిక. ఆ దృష్టికోణం నుండి చూస్తే, నేటి మెరిట్ భావన కులం, తరగతి కలయిక సృష్టించిన సామాజిక, సాంస్కృతిక వన రులను తటస్థమైన ప్రతిభగా చిత్రీకరించే భావజాల ఆయు ధం మాత్రమే. అందుకే రిజర్వేషన్ ద్వారా వచ్చిన ప్రతి విద్యార్థి అనర్హుడుగా ముద్రవేయబడతాడు.

Caste discrimination
Caste discrimination

చదువును వస్తువుగా, డిగ్రీని అమ్మకం సరుకుగా ..

యాజమాన్య కోటాల ద్వారా వచ్చినవారు ఎన్నడూ ఆ ముద్రను భరిం చారు. మార్క్స్ చెప్పిన మిగులు విలువ దోపిడీ సూత్రం ఇక్కడ మరో రూపంలో కనిపిస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ దొరకని 38 శాతం గ్రాడ్యుయేట్ల వాస్తవాన్ని సంస్థలు దాచి పెడుతూ, ఫలితాన్ని విద్యార్థి వ్యక్తిగత లోపంగా చిత్రీకరి స్తాయి. చదువును వస్తువుగా, డిగ్రీని అమ్మకం సరుకుగా మార్చిన ప్రైవేటీకరణ క్రమంలో, అట్టడుగు వర్గాల విద్యార్థి మరణం కేవలం సామాజిక దుర్ఘటనకాదు. పెట్టుబడితనకు లాభసాటికాని శ్రామికశక్తిని వదిలించుకునే క్రూరమైన యం త్రాంగంలో భాగంకూడా. ఈ నిర్వీర్వీకరణ కొత్తది కాదు. తెలుగునేలపై దీనికి స్పష్టమైన చరిత్రఉంది. వెయ్యితొమ్మిది వందల తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభు త్వం పన్నెండు ప్రైవేట్ మెడికల్, ఎనిమిది డెంటల్ కాలేజీ లకు దొడ్డిదారిన అనుమతులిచ్చి క్యాపిటేషన్ ఫీజుల దందా కు తెరలేపినప్పుడు, కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వం లో పీడీఎస్ఈయూ మిగతా విద్యార్థిసంఘాలను ఏకంచేసింది. తెలుగు యువత అసెంబ్లీ, సెక్రటేరియట్ ముట్టడిలతో ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేసింది. హైకోర్టు ఆ జీవోలను రద్దు చేసి సీఎం అధికార దుర్వినియోగాన్ని తప్పు బట్టడంతో నేదురుమల్లి పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన కోట్ల ప్రభుత్వంలో వైద్య మంత్రి సమరసింహారెడ్డి విద్యార్థులపై లాఠీఛార్జీలు చేయించినా, ఆ ఒత్తిడి కొనసాగి చివరికి ఆయనే బర్తరఫ్ అయ్యారు. ఐక్యవిద్యార్థి శక్తి పాల కుల పీఠాలను కదిలించగలదని రుజువైన ఏడాది అది. కురు క్షేత్ర జాతీయ సాంకేతిక సంస్థలో రెండునెలల్లో నలుగురు, గోవా బిట్స్ పిలానీలో పదిహేను నెలల్లో ఆరుగురు మరణిం చడం ఈసమస్య రాజకీయ సరిహద్దులు దాటిందని చూపు తుంది. కానీపరిష్కారం రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాల నీడల్లో దొరకదు. సమకాలీన అంశాలపై విద్యార్థి సంఘాలు స్పందించడంలేదు, ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వాళ్లకి వాళ్లు అని కుంచించుకుపోతున్నారు. నాటి ఐక్యత నేటి విద్యార్థి రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగైంది. పరిష్కారం రాజకీయ పార్టీల విధేయతలో లేదు, సంస్థాగత జవాబుదారీతనాన్ని చట్టబద్ధం చేయడంలో, బహుజన విద్యార్థి శక్తులను తిరిగి ఐక్యం చేయడంలో ఉంది.

-పాపని నాగరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు