Black money : ఎన్నికల్లో నల్ల డబ్బే కీలకమా?

Follow Us: Google News Daily Hunt
Black money
Black money
FONT SIZE
GET APP

Black money : స్థానిక రాజకీయాలు మారితేనే దేశ రాజకీయాలు మారతాయి, దేశ రాజకీయాలపై మనం ఎన్నో విమర్శలు చేస్తాం, పార్లమెంటులో అవినీతి అంటాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, పార్టీలను తప్పుబడతాం. కానీ ప్రజాస్వామ్యానికి మొదటి పాఠశాల అయిన స్థానిక రాజ కీయాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. నిజానికి దేశ రాజకీ యాల నాణ్యతను మార్చాలంటే మార్పు గ్రామం నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక వృక్ష జాతి ఉందంటే నమ్మగలమా? నిజమే మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన వృక్షంగా ఖ్యాతి గడించిన ఎర్రచందనం చెట్లు. రాయలసీమ అంటే కేవలం కరవు, వెనుకబాటుతనం, వలసలు మాత్రమే కాదు. ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఎర్ర చందనం కూడా ఉంది. అయితే అదే ఎర్రచందనం అక్రమ ర వాణా, స్మగ్లింగ్, రాజకీయ అధికార సంబంధాలు, నల్ల ధనం వంటి ఆరోపణలతో తరచూ వార్తల్లోకి వస్తోంది.

Read Also : SIR : ‘సర్’ సాగుతోంది!

Black money
Black money

Black money : ప్రజాస్వామ్యంపై ద్వంద్వ దోపిడీ

స్థానిక ఎన్నికల సమయంలో ఈ నల్లధనం రాజకీయాల్లోకి ప్రవహిస్తుందనే ఆరోపణలు వినిపించినప్పుడల్లా మనలో వచ్చే అసలు ప్రశ్న, ఎర్రచందనం విలువ ఎంత? ఆ సంపద ఎవరి చేతుల్లోకి వెళ్లోంది? ఆ డబ్బు ప్రజాస్వామ్యాన్ని ప్రభా వితం చేస్తుందా? అనే దానిపై చూస్తే భయమేస్తోంది. ఎర్ర చందనం చెట్టు అడవిలో సహజసిద్ధంగా పెరుగుతుంది. దాన్ని అక్రమంగా నరికే వ్యక్తులు కొందరు, ర వాణా చేసే వ్యక్తులు మరొకరు, అంతర్జాతీయ మార్కెట్కు చేసే గొలుసు కట్టు మరొకటి, మధ్యలో స్థానికంగా రక్షణ, సమాచారం, లాజిస్టిక్స్, రాజకీయ ప్రభావం వంటి అంశాలు ఉంటే అది కేవలం స్మగ్లింగ్ కాదు, ఒక వ్యవస్థీకృత నల్ల ఆర్ధిక వ్యవ స్థగా మారుతుంది. అలాంటి డబ్బు ఎన్నికలలోకి వస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. అడవిని దోచిన డబ్బుతో ఓటును కొనడం జరిగితే, అది కేవలం అవినీతి కాదు ప్రజా స్వామ్యంపై ద్వంద్వ దోపిడీ. మొదట అడవిని దోచుకుంటారు, తర్వాత ఆ డబ్బుతో ఓటును ప్రభావితం చేస్తారు. చివ రికి అధికారాన్ని ఉపయోగించి అదే వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్ వంటి స్థానిక సంస్థలు ప్రజల రోజువారీ జీవి తానికి అత్యంత దగ్గరగా ఉంటాయి.

ఎన్నికల వ్యవస్థకు ఒక పెద్ద సవాలు

రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, ప్రభుత్వ పథకాలు, గ్రామీణ వనరులు ఇవన్నీ స్థానిక సంస్థల నిర్ణయాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం అంటే కేవలం ఒక అభ్యర్థి గెలుపుకాదు. రేపటి గ్రామపాలన ఎవరి చేతుల్లో ఉండాలి అన్న ప్రశ్న. ప్రజల సమస్యలను పరిష్కరించే వ్యక్తి గెలవాలా? లేకడబ్బు ఖర్చు చేయగల వ్యక్తి గెలవాలా? ఎర్రచందనం డబ్బుఉంటే ఎన్నికల ఖర్చును ఎందుకు ప్రశ్నించకూడదు? ఎన్నికల సమ యంలో ఒక అభ్యర్థి తన సాధారణ ఆర్థిక సామర్థ్యానికి మించి భారీగా ఖర్చు చేస్తున్నాడనే అనుమానం వస్తేదాని మూలాన్ని పరిశీలించడం అధికార యంత్రాంగం బాధ్యత. అదే సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా, నల్లధనం, ఎన్నికల ఖర్చుల మధ్య సంబంధం ఉందనే నిర్దిష్ట సమా చారం ఉంటే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇక్కడే ఎన్నికల వ్యవస్థకు ఒక పెద్ద సవాలు ఉంది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరింది? ఎవరెవరు ఎంతఖర్చు చేశారు? ఎవరెవరు లబ్ది పొందారు? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే నిజమైన ఎన్నికల పారదర్శకత సాధ్యమవుతుంది. రాయలసీమలో ఎర్రచందనం అడవులు కేవలం ప్రభుత్వ ఆస్తి కావు, అవి జీవవైవిధ్యానికి నిలయం, భవిష్యత్ తరాలకు చెందిన సహజవనరు పర్యావరణ సంపదలు.

ప్రజాస్వామ్యం మార్కెట్గా మారుతుంది

చెట్లను అక్రమంగా నరికితే నష్టపోయేది కేవలం అటవీ శాఖ మాత్రమే కాదు. నష్టపోయేది ప్రజల ఆస్తి, నష్టపోయేది పర్యావరణం. నష్టపోయేది ముఖ్యంగాభవిష్యత్ తరాలు. ఆచెట్లను నరికిన డబ్బు ఎన్నికలలోకి వచ్చి ప్రజల ఓట్లను ప్రభావితం చేస్తే, నష్టం మరింత పెరుగుతుంది. అందుకే ఎర్రచందనం అక్రమ రవాణాను కేవలం అటవీ నేరంగా చూడకూడదు. ఇది పర్యావరణ నేరంగాను, ఆర్థిక నేరంగాను అవసరమైతే ఎన్నికల నేరంగాను చూడాలి. ఓటుకు డబ్బు తీసుకున్న వ్యక్తిని మాత్రమే నిందించడం సులభం. కానీ ప్రశ్నించాల్సింది ఓటు కొనడానికి అంత డబ్బుఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల సంఘం, పోలీస్, అటవీ శాఖలు సవాలుగా తీసుకుని రాబోవు స్థానిక ఎన్ని కలలో మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ప్రముఖంగా ఎన్నికల యంత్రాంగం అక్రమ ఎన్నికల ఖర్చు, ఓటర్ల ప్రలోభాలను పర్యవేక్షించాలి. పోలీసు శాఖ నేర పూరిత నిధుల ప్రవా హాన్ని, అక్రమ రవాణా నెట్వర్క్లపై దర్యాప్తు చేయాలి. అటవీ శాఖ ఎర్రచందనం అక్రమ నరికి వేత, రవాణా, నిల్వ, స్మగ్లింగ్ను అడ్డుకోవాలి. అవసరమైతే ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలు కూడా నిధుల మార్గాన్ని పరిశీలించాలి. ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఎన్నికలలోడబ్బు తీసుకోవడం సాధారణమై పోతే ప్రజాస్వామ్యం నెమ్మదిగా మార్కెట్గా మారుతుంది. ఈ రోజు రెండు వేలరూపాయల కు ఓటు అమ్ముకున్న వ్యక్తి రేపు తన గ్రామంలో మంచి రోడ్డు అడిగే నైతిక హక్కును కోల్పోతారు. కానీ అతని ఓటును కొనుక్కున్న రాజకీయ వ్యవస్థ మాత్రం ప్రజాసేవను వ్యాపారంగా మార్చే ప్రమాదం ఉంది.

Black money
Black money

ప్రజల విశ్వాసంతో నడిచే స్థానిక పాలన

ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరిగే కొద్దీ ప్రజాసేవ చేయాలనుకునే సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి రావడం కష్టమైపోతోంది. ఎందుకంటే అతని దగ్గర కోట్ల రూపాయలు ఉండకపోవచ్చు. పెద్ద రాజకీయ పరిచయాలు లేకపోవచ్చు. వందల మందిని ఎన్నికల కోసం సమీకరించే ఆర్ధిక శక్తి ఉండకపోవచ్చు. కానీ అతనికి నిజా యితీ ఉండవచ్చు. ప్రజల కోసం పనిచేసే సంకల్పం ఉండ వచ్చు. అలాంటి వ్యక్తి డబ్బు రాజకీయాల ముందుఓడిపోతే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? లేక ధనస్వామ్యం గెలిచినట్టా? ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బు నిజంగా ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే ఆధారాలు ఎక్కడైనా లభిస్తే, వ్యక్తి ఎంత పెద్దవాడైనా, పార్టీ ఎంత శక్తివంతమైన దైనా, నిధుల మూలాన్ని దర్యాప్తు చేయాలి. అదే సమయం లో ఆధారాలులేకుండా మొత్తం ప్రాంతాన్ని లేదా ఒక రాజ కీయ పార్టీని ఎర్రచందనం మాఫియాగా ముద్ర వేయడం బాధ్యతారాహిత్యమేఅవుతుంది. అడవిని కాపాడాలి, నల్ల ధనాన్ని అడ్డుకోవాలి, స్థానిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే అడవిలో ఎర్రచందనం దోపిడీ అయితే అది ప్రకృతి దోపిడీ, ఆ దోపిడీ డబ్బుతో ఓటు కొనబడితే అది ప్రజాస్వామ్య దోపిడీ. రాయలసీమకు కావలసింది మాఫియా డబ్బుతో నడిచే రాజకీయాలు కాదు ప్రజల విశ్వాసంతో నడిచే స్థానిక పాలన. అందుకే స్థానిక ఎన్నికల అసలు ప్రశ్న ఎవరు గెలుస్తారు?కాదు. ఎవరు గెలిస్తే ప్రజలు గెలుస్తారు? అదే నిజమైనప్రజాస్వామ్య పరీక్ష. స్థానిక రాజకీయాలు మారితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితేనే దేశం బలపడుతూ అభివృద్ధి చెందుతుంది.

-డాక్టర్ ఎ. భాగ్యరాజ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు