ED summons Azharuddin

అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు

ED summons Azharuddin
ED summons Azharuddin

హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 1984- 2000 వరకు అజారుద్దీన్‌ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

తన కెరీర్‌లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్‌లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్‌లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్‌ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్‌ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో 2020 – 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్‌మెంట్‌, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్‌ ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పొందాడు.

Related Posts
కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth's request to the

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..
Prashant Kishor reaction on AAP defeat..

అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. Read more

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anita responded to Deputy CM Pawan Kalyan comments

అమరావతి : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన Read more

భైరవ అష్టమి మహోత్సవం..2024 రకాల మిఠాయిలు..84,000 చదరపు అడుగుల రంగోలీతో ప్రపంచ రికార్డు
Bhairava Ashtami Mahotsavam.2024 types of sweets.world record with 84000 square feet Rangoli

హైదరాబాద్‌: అఖిల భారతీయ బతుక భైరవ భక్త మండలి మరియు పార్శ్వ పద్మావతి శక్తి పీఠం, కృష్ణగిరి, తమిళనాడు పీఠాధిపతి డా. వసంత్ విజయ్ జీ మహారాజ్ Read more