మనీ ల్యాండరింగ్ కేసు లో శంకర్ కు ఈడీ షాక్

మనీ ల్యాండరింగ్ కేసు లో శంకర్ కు ఈడీ షాక్

ప్రముఖ దర్శకుడు శంకర్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో శంకర్‌కు చెందిన దాదాపు రూ. 10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ గురువారం ప్రకటించింది.ఈ వ్యవహారం 2011లో అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌తో ప్రారంభమైంది. ‘జిగుబా’ అనే కథను శంకర్ అనుమతి లేకుండా తీసుకుని, ‘రోబో’ సినిమా రూపొందించారని ఆయన ఆరోపించారు. శంకర్ కాపీరైట్ మరియు ఐపీఆర్ చట్టాలను ఉల్లంఘించారని తమిళనాథన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై దర్యాప్తు చేసి, శంకర్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ‘జిగుబా’ కథకు, ‘రోబో’ సినిమాకు మధ్య గణనీయమైన పోలికలున్నాయని పేర్కొంది. ఈ ఆధారాలతో, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం శంకర్‌పై కేసు నమోదైంది.

ఈడీ

ఈ కేసు ఆధారంగా శంకర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. శంకర్, ఈ కేసు పరిష్కారం కోసం వివిధ మార్గాల్లో పెద్ద మొత్తంలో నిధులను మళ్లించారని, అవి మనీలాండరింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన మూడు స్థిరాస్తులను ఫిబ్రవరి 17న అటాచ్ చేశారు.

శంకర్ రెమ్యూనరేషన్

2010లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి శంకర్ దాదాపు రూ. 15 కోట్ల పారితోషికంగా అందుకున్నారు.

ఇన్వెస్టిగేషన్ లో బయట పడిన విషయాల ఆధారంగా 10 కోట్ల 11 లక్షలు విలువ కలిగిన శంకర్ మూడు స్థిరాస్తులను ఈడి తాజాగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది.కాపీ రైట్ యాక్ట్ 1957ని ఉల్లంఘిస్తూ శంకర్ కాపీరైట్ పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ అఫ్ ఇండియా (FTII) చేపట్టిన మరో విచారణలో ఏంథిరన్, జిగూబా మధ్య చాలా పోలికలు ఉన్నాయని నిర్ధారించింది. దీంతో శంకర్ కు సంబంధించిన 11 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ వచ్చింది. తదుపరి చర్యలు ఇంకా వెల్లడించలేదు. ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఐ వంటి భారీ విజువల్ వండర్స్‌ను చిత్ర పరిశ్రమకు అందజేశారు శంకర్. టెక్నాలజీని అద్భుతంగా వాడగల దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆయన అద్భుతాలు సృష్టించారు. జీన్స్ చిత్రంలోని ఒక పాటను ప్రపంచంలోని ఏడు వింతల వద్ద షూట్ చేసారు . కానీ అలాంటి దిగ్గజ దర్శకుడు నేడు వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు . స్నేహితుడు, భారతీయుడు 2, గేమ్ ఛేంజర్‌లు ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి.

Related Posts
Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్
singer rahul sipligunj

'ఆర్ఆర్ఆర్' సినిమా లోని 'నాటు నాటు' పాటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన ప్రతిభతో విశేష అభిమానం సంపాదించారు బిగ్ బాస్ ఫేమ్‌గా తనకు Read more

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో మూవీ
trivikram allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన శైలితో అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పుష్ప చిత్రం ద్వారా ఆయన ఎన్నో అవార్డులు మరియు కీర్తిని Read more

రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూసారా..
jai hanuman movie

రిషబ్ శెట్టి: వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కన్నడ స్టార్ కన్నడ చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం Read more

కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌
కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌

కల్కి 2898 ఏడీ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్‌ను మరో స్థాయిలో చూపించబోతున్నామని యూనిట్ హింట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *