ED Attacks : హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సురానా గ్రూప్ కంపెనీపై ఈడీ సోదాలు చేసింది. చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి.

మాస్టర్ ఎంక్లేవ్లోని విల్లాల్లో సోదాలు
బోయిన్పల్లిలోని అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్లోని విల్లాల్లో సోదాలు చేశారు. రెండు నెలల క్రితం కేసు నమోదు చేసుకున్న ఈడీ రంగంలోకి దిగింది. అనంతరం.. ఈరోజు వేకువజామున నాలుగు గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. సురానా ఇండస్ట్రీస్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు చేసింది.
కంపెనీ చైర్మన్ MD ఇళ్లలో సోదాలు
బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్లో ఈడీ సోదాలు జరిగాయి. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్ MD ఇళ్లలో సోదాలు చేశారు. చెన్నైకి చెందిన ED బృందాలు సోదాలు జరిపినట్లు తెలిసింది. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి సురానా కంపెనీ వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా సురానా కంపెనీ ఎగ్గొట్టింది. ఇప్పటికే సురానా గ్రూప్పై CBI కేసు నమోదైంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుంది.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి