ED notices to former MLA Marri Janardhan Reddy

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులోని రూ. 1000 కోట్లకుపైగా విలువైన భూదాన్ భూములను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ప్రైవేటు పరం చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి రావడంతో తాజాగా మర్రి జనార్దన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కేఎస్ఆర్ మైన్స్‌కు చెందని కె.సిద్ధారెడ్డి, అమ్మద డెవలపర్స్‌కు చెందిన సూర్యతేజ తదితరులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎల్లుండి (16న) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అమోయ్ కుమార్ ద్వారా వీరంతా లబ్ధిపొందినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసింది.

భూదాన్ భూములను ప్రైవేటు పట్టా భూములుగా మార్చి వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దస్తగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడీ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.

Related Posts
శైలజానాథ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..
Jagan invited Shailajanath wearing a party scarf

అమరావతి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి Read more

ఆస్థి తగాదాలే హత్య కు కారణం-ఎస్పీ
ఆస్థి తగాదాలే హత్య కు కారణం-ఎస్పీ

భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన భూ వివాద హత్యకేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసి, నిందితుల హత్యా Read more

అశోక్ నగర్ లో మళ్లీ ఉద్రిక్తత
Tension again in Ashok Naga

హైదరాబాద్ అశోక్ నగర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో Read more

వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
vasantha panchami in 2025

వసంత పంచమి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్న భక్తులు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *