మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సిపి మాజీ ఎంపి ఎంవివి సత్యనారాయణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు తీసుకుంది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన ₹44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఎంవివి సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జివి, మేనేజింగ్ భాగస్వామి గద్దె బ్రహాజీ కీలకంగా వ్యవహరించినట్లు ఈడి దర్యాప్తులో తేలింది.

Advertisements

హయగ్రీవ ఫామ్స్ ప్లాట్లు విక్రయించక దాదాపు ₹150 కోట్ల ఆదాయం వచ్చిందని ఈడి వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎంవివి సత్యనారాయణ నివాసాలు, కార్యాలయాలపై ఈడి సోదాలు నిర్వహించింది. అనాథలు, వృద్ధుల సంక్షేమం కోసం కేటాయించిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈడి ఆరోపించింది. 2023 జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఫిర్యాదు మేరకు అరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హయగ్రీవ ప్రాజెక్ట్ కింద ఎంవివి సత్యనారాయణ, ఇతరులు బలవంతంగా 12.51 ఎకరాల భూమిని తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఈడి దర్యాప్తు చేపట్టి, ఎంవివి సత్యనారాయణకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంవివి సత్యనారాయణపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ ఆస్తుల కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts
వైసీపీ వేధింపుల్లో నేను ఒక బాధితురాలిని – షర్మిల
sharmila ycp

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ట్విట్టర్ లో సామాజిక మాధ్యమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు సమాజానికి మంచిని అందించేందుకు సృష్టించబడినవే కానీ Read more

మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా : సీఎం
CM Revanth Reddy speaking at the Secunderabad Parade Ground

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన Read more

Fire Accident : కోకాపేట్‌లో భారీ అగ్నిప్రమాదం
Major fire in Kokapet

Fire Accident : నగరంలోని కోకాపేట GAR టెక్ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి Read more

రాజ్యాంగ చర్చ కోసం లోక్ సభ, రాజ్య సభ తేదీలు ఖరారు
parliament

పార్లమెంట్‌లో సోమవారం అన్ని పార్టీల నేతలతో జరిగిన సమావేశం అనంతరం, లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీలు వచ్చే వారం రాజ్యాంగంపై చర్చను నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ Read more