EC responded to Rahul Gandh

రాహుల్ గాంధీ ఆరోపణల పై స్పందించిన ఈసీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

Advertisements

ఈ విషయంపై ఈసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో స్పందిస్తూ..రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వారి అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలను గౌరవంతో స్వీకరిస్తాం. ఈ ఆరోపణలపై త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాం. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్‌ వివరణ అందిస్తుంది అని పేర్కొంది.

image

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారు.గత ఐదేళ్లలో రాష్ట్రంలో 32లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అంతే కాకుండా,మహారాష్ట్రలో లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అసలు వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అని ప్రశ్నించారు.

అదనంగా..39 లక్షల ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్యకు సమానం.లోక్‌సభ ఎన్నికల్లో మేము పొందిన ఓట్ల శాతం,అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం సమానంగా ఉంది.కానీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు మాత్రం అదనంగా ఓట్లు వచ్చాయి.ఆఓట్ల ద్వారానే వారికి విజయం లభించింది.ఎన్నికలసంఘం మా డిమాండ్‌ను స్వీకరించి,ఓటర్ల జాబితా,వారి ఫొటోలు, చిరునామాలను అందించాలి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Related Posts
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ -జెలెన్స్కీ సమావేశం
నా స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు: జెలెన్స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ట్రంప్ జెలెన్స్కీపై తీవ్రంగా Read more

Raja Singh : వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి
వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి

Raja Singh : వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లకు Read more

ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు

అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన హైదరాబాద్‌: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ Read more

Delhi: భార్యను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న భర్త..ఎందుకంటే?
Delhi: భార్యను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న భర్త..ఎందుకంటే?

క్యాన్సర్ బారిన పడ్డ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. 46 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి తన భార్య అన్షు ని కాల్చి Read more

×