Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభించింది. ఈ ఘటనలో 1600 మందికిపైగా మృతి చెందగా.. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు.మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు.

Advertisements

భూకంప ప్రభావం

భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

భూకంప బీభత్సం

భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌లోనూ తీవ్రంగా ఉంది. కొన్ని నగరాల్లో భవనాలు బీటలవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.మయన్మార్‌, థాయ్‌లాండ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏ ఎఫ్ ఎస్ హిండన్ నుంచి ఐ ఏఎఫ్ సి 130 జె విమానం సహాయక సామగ్రితో బయలుదేరింది. ఈ సహాయ సామగ్రిలోటెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు,తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం,వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్లు,సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు,తదితర అత్యవసర వస్తువులు ఉన్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగించేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టింది.

https d1e00ek4ebabms.cloudfront.net production 6ba7d07d 4db9 480e 8024 b5d7b4a705cf

మూడు భూకంపాలు

రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఏకంగా మూడు భూకంపాలు మయన్మార్ ప్రజలను భయపెట్టాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల అనంతరం 4.7 తీవ్రతతో మరో భూకంపం ప్రజలను భయపెట్టింది.

హైరైజ్ భవనం 

శుక్రవారం నాటి భూకంపం కారణంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 78 కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. నగరంలో చనిపోయిన మరో 10 మందిని నిన్న గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related Posts
Earthquake: మయన్మార్‌ భూకంపం .. 100 దాటిన మృతుల సంఖ్య
Myanmar earthquake..Death toll crosses 100

Earthquake: మయన్మార్‌ భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతోంది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 103 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరోవైపు, Read more

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగిన అర్జెంటీనా
Argentina withdrawal from the World Health Organization

అర్జెంటీనా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలుగుతున్నట్లు అర్జెంటీనా తాజాగా ప్రకటించింది. అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్‌ అడోర్నీ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ మేరకు Read more

ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కొత్త ప్రాజెక్ట్‌..
Mars 1

ఎలాన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ ఇప్పుడు మంగళగ్రహం కోసం కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని పేరు 'మార్స్‌లింక్'. ఈ ప్రాజెక్ట్, స్పేస్‌ఎక్స్ యొక్క ప్రముఖ ఇంటర్నెట్ సేవ Read more

Mark Carney: ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌
ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌… కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×