అమెరికాలోని అలాస్కా (Alaska, USA) తీరంలో బుధవారం ఉదయం ప్రకృతి సృష్టించిన ప్రకంపనలు హఠాత్తుగా ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. (Alaska Earthquake) రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.భూకంపం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కేంద్ర బిందువు సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని USGS పేర్కొంది. ఇది భూకంప కేంద్రంగా నమోదైన లోతు 20.1 కిలోమీటర్లు. ఈ ప్రకంపనలు సమీప ప్రాంతాలనూ గట్టిగా కుదిపేశాయి.

సునామీ ప్రమాదానికి అధికారులు అలర్ట్
భూకంపం తర్వాత వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్ప ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, సముద్రంలో పెరుగుతున్న అలలతో తీరప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.సునామీ హెచ్చరికలు కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణంగా) నుండి యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు వాయువుకి) వరకు ఇచ్చారు. పసిఫిక్ తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
1964 భూకంపం జ్ఞాపకం తిరిగొచ్చిన ఉదంతం
ఈ ఘటన 1964లో అలాస్కాలో సంభవించిన భయంకరమైన భూకంపాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో 9.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆంకరేజ్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దానివల్ల ఏర్పడిన సునామీ హవాయి దాకా ముంచెత్తింది. దాని ధాటికి 250 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం అలాస్కాలోని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరప్రాంతాలవైపు రావద్దని, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. ఆపత్కాల చర్యలు మొదలుపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also : drunk and drive : హైదరాబాద్‌లో పగటి వేళల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు