ఇటీవల కాలంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. నిత్యం ఏదో ఒకదేశంలో భూమి కంపిస్తున్నాయి. తాజాగా సోమవారం అలాస్కా, తజికిస్తాన్లో భూకంప ప్రకంపనలు (Earthquake) సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తజికిస్తాన్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా (4.6 on the Richter scale) నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. ఒకే వారంలో అలాస్కాలో రెండు తీవ్ర భూకంపాలు సంభవించాయి.

సునామీ ముప్పు హెచ్చరికలు
భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కా (Alaska) లో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు (Earthquake) సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయందోళన చెందారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు తరచూ భూమి కంపిస్తుండడంతో ఆయాదేశాధినేతలు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సునామీ వార్నింగ్ఇ స్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్థానిక అధికారులు మత్సకారులను హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు .
అలాస్కా, తజికిస్తాన్‌లలో భూకంపం ఎప్పుడు సంభవించింది?
అలాస్కా మరియు తజికిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో 2025 జూలై 20న ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపాలు సంభవించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం భూకంప తీవ్రత 6.3 నుండి 6.8 రిక్టర్ స్కేల్ మధ్య నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Barack Obama: ఒబామా అరెస్టు.. ఏఐ వీడియోపై ట్రంప్ నవ్వులు