school holidays in august

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!

Dussehra holidays in AP from 3rd of this month!
Dussehra holidays in AP from 3rd of this month!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు… చంద్రబాబు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక క్లాసులు నిర్వహించకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ పదో తరగతి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా, వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్… అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా… ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి

Related Posts
దూసుకెళ్తున్న కేజ్రీవాల్!
దూసుకెళ్తున్న కేజ్రీవాల్!

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారని సూచిస్తున్నారు. జంగ్‌పురా నియోజక వర్గంలో ఆప్ నేత మనీష్ Read more

హర్యానా బీజేపీ చీఫ్ పై అత్యాచారం కేసు
Gang rape case against Haryana BJP chief Mohanlal

చండీగఢ్: హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ (61)పై హిమాచల్ ప్రదేశ్‌లో గాయకుడు రాకీ మిట్టల్‌తో పాటు అత్యాచారం కేసు నమోదైంది. సోలన్ జిల్లాలోని టూరిస్ట్ Read more

Mumtaz Hotels : తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా
Swamiji's dharna

తిరుపతిలో హిందూ స్వామిజీలు, ధార్మిక సంఘాలు ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన చేపట్టారు. ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హోటల్ ప్రాజెక్ట్ భక్తుల Read more

కనుమ.. ప్రత్యేకతలు ఏంటి..? రథం ముగ్గు.. ఎందుకు ?
kanuma ratham muggu

సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమకు ప్రత్యేక స్థానం ఉంది. కనుమను ప్రధానంగా పశువులకు అంకితం చేస్తారు. రైతుల తోడుగా ఉంటూ ఏడాది పొడవునా శ్రమించే పశువులను Read more