ఏపీ డీఎస్సీ (AP DSC) పరీక్షలకు హాజరవ్వనున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. జూలై 1, 2 తేదీల్లో (On July 1st and 2nd) నిర్వహించనున్న పరీక్షల కోసం హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.మునుపు జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అధికారులు ఈ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల మార్పు – కొత్త హాల్ టికెట్ తప్పనిసరి
పరీక్ష తేదీలు మారడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కూడా మార్పు చేశారు. అందుకే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌లో పేర్కొన్న తేదీ, కేంద్రాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు హాజరుకావాలి. పాత హాల్ టికెట్‌తో పరీక్ష కేంద్రానికి వెళ్లితే అనవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే జరిగిన పరీక్షలకు విశేష స్పందన
ఇటీవలి ఆదివారం నిర్వహించిన ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షలకు భారీగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 19,750 మంది అభ్యర్థులకుగాను 18,231 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 97.81% హాజరు నమోదవగా, నెల్లూరు జిల్లాలో 88.04% హాజరుతో మంచి స్పందన లభించింది.అభ్యర్థులు పరీక్షకు ముందు హాల్ టికెట్‌ను జాగ్రత్తగా చదివి, పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందు చేరాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డు, అవసరమైన పరికరాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.apdsc.apcfss.in
Read Also : Chandrababu : ఫిట్‌నెస్ ట్రైనర్ గృహప్రవేశానికి హాజరైన చంద్రబాబు