భారత్–పాక్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.పాకిస్థాన్ సైన్యం బారాముల్లా నుంచి భుజ్ వరకు డ్రోన్లు, శతఘ్నాలతో దాడులు చేపట్టింది.భారత్ మాత్రం వెంటనే స్పందించి గట్టి ఎదురు దాడులు చేసింది.పాకిస్థాన్ దాడులకు భారత బలగాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి.డ్రోన్లు ప్రయోగించిన కీలక వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.పాక్ భూభాగంలోని నాలుగు ప్రధాన స్థావరాలపై భారత్ ప్రతిదాడులు చేసినట్టు సమాచారం.చీకటి పడ్డ వెంటనే దాడులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురా స్థావరాలపై పాక్ డ్రోన్లు వచ్చాయి.
భారత సైన్యం వాటిని గాల్లోనే ఛేదించింది.పాక్ దుస్సాహసానికి ప్రతిగా, భారత బలగాలు చక్లాలా, మురీద్, షోర్కోట్ ఎయిర్‌బేస్‌లపై తీవ్ర దాడులు జరిపాయి.ఈ దాడుల్లో భారీ పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.వాయుసేన స్థావరాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు పాక్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.ఈ దాడుల సంగతి పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి అధికారికంగా ధృవీకరించారు. భారత్ దాడికి తాము గట్టి ప్రత్యుత్తరం ఇస్తామని పాక్ చెబుతోంది.ఈ దాడులకు ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ అనే పేరు కూడా పెట్టారు.ఇక భారత్ వైపు నుంచి ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన లేదు.
భారత సైన్యం లేదా వాయుసేన ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.అయితే తాజా పరిణామాలపై శనివారం ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది.పాకిస్థాన్ తిరిగి దాడులు ప్రారంభించిందనే వార్తలు వస్తున్నాయి.శనివారం తెల్లవారుజాము నుంచి డ్రోన్ గాలింపు కార్యకలాపాలు తిరిగి పెరిగాయి. దీనితో రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.వాస్తవానికి, పాకిస్థాన్ ప్రవర్తనపై భారత్ ఇప్పటికే గట్టి హెచ్చరికలు ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఈ దాడులు దాని కొనసాగింపులే అన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది.సరిహద్దుల్లోని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. స్థానిక అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. సైనిక చొరవతో ప్రజలకు భద్రత కల్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇది కేవలం రెండురాష్ట్రాల సమస్య కాదు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా కూడా ఆందోళన రేపుతున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడకుండా రాజకీయ స్థాయిలో చర్చలు అవసరం.
Read Also : Nirmala Sitharaman : బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన