Drone attack on Israeli Prime Minister Netanyahus residence

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్‌ దాడి

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆందోళనకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని పలు కథనాలు వెలువడ్డాయి. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన సతీమణి నివాసంలో లేరని పేర్కొంది. ఇక ఈ ఉదయం లెబనాన్‌వైపు నుంచి డ్రోన్లు దూసుకొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా గ్రూప్‌లు అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌తో సహా నాయకత్వ హోదాలో ఉన్న పలువురిని నెతన్యాహు సేనలు(IDF) హతమార్చాయి. అలాగే లెబనాన్‌లోని హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లను మట్టుపెట్టింది. సిన్వర్ మృతి తర్వాత స్పందించిన హెజ్‌బొల్లా.. తమ పోరాట దశను మార్చేలా ప్రణాళికలు వేసుకున్నామని తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో దాడులు తీవ్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా కేంద్రమైన లెబనాన్‌ వైపు నుంచి మూడు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. సిజేరియాలోకి ఒక భవనాన్ని డ్రోన్ ఢీకొట్టినట్లు తెలిపాయి. మరో రెండింటిని అడ్డుకున్నామని పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే.. సిన్వర్ మృతితో యుద్ధం కీలకమలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీలు విడుదలయ్యేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేసింది. హమాస్‌ మిలిటెంట్లు ఆయుధాలను వదిలి.. బందీలను విడుదల చేస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని నెతన్యాహు ప్రకటించారు. ఆపై హమాస్‌ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వెంటాడి మరీ వారిని హతమరుస్తామని హెచ్చరించారు. దానికి తగ్గట్టే ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. 33 మంది పాలస్తీనా వాసులు మృతి చెందగా.. అందులో 21 మంది మహిళలే ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Related Posts
విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం
electricity demand telangan

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 6న రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ 15,752 మెగావాట్లకు పెరిగింది. ఇది తెలంగాణ చరిత్రలో Read more

ఉత్తరాఖండ్‌లో ఈరోజు నుండి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
uttarakhand to implement uniform civil code from today

డెహ్రాడూన్‌: యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి - యూసీసీ) అంటే… యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో Read more

రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
Sant Sevalal Maharaj Jayant

సేవాలాల్ మహారాజ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రత్యేక సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు ఈరోజు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *